4500 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించిన మహేశ్ బాబు

ఉచితంగా 4500లకు పైగా గుండె ఆపరేషన్స్ చేయించి చిన్నారులకు నూతన జీవితాన్ని ప్రసాదించారు.;

Advertisement
Update:2025-03-18 16:00 IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతరులకు సాయం చేసే హీరోలో అతి కొద్ది మంది మందే ఉన్నారు. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు ముందు వరుసలో ఉంటుంటారు.ఆయన అందించే సేవ ఎవరి కంటికి కనిపించదు.కానీ, ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు నిలబడ్డాయంటే అది మహేశ్ బాబు చలవే అని చెప్పుకోవచ్చు.ఎందుకంటే సూపర్ స్టార్ ఇప్పటివరకు 4,500 మంది చిన్నారుల ప్రాణాలను రక్షించారు. ఇప్పటివరకు ఉచితంగా 4500లకు పైగా గుండె ఆపరేషన్స్ చేయించి చిన్నారులకు నూతన జీవితాన్ని ప్రసాదించారు.

నిన్నటి వరకు 4500 పైగా ఆపరేషన్స్ జరిగినట్టు ఆంధ్రా హాస్పిటల్స్ యాజమాన్యం ప్రకటించింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..సూపర్ స్టార్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి.ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. త‌మ అభిమాన హీరో చేస్తున్న స‌మాజ సేవ ప‌ట్ల వారు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అటు మ‌హేశ్ బాబు సతీమణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ ఏపీలో మ‌ద‌ర్స్ మిల్క్ బ్యాంక్‌తో పాటు బాలిక‌ల‌కు ఉచితంగా గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ టీకాను అందించే కార్య‌క్ర‌మాన్ని తాజాగా ప్రారంభించారు. మ‌హేశ్ బాబు ఫౌండేష‌న్ పిల్ల‌ల హార్ట్ ఆప‌రేషన్ల‌ను కొన‌సాగిస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా ఆమె వెల్ల‌డించారు.

Tags:    
Advertisement

Similar News