అయ్యయ్యో.. బాలీవుడ్‌కు ఏమైంది..!
ఈ వారం అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ హీరోగా నటించిన రక్షాబంధన్ సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు కలిపి మొదటి రోజు రూ.20 కోట్లు లోపే వసూళ్లు సాధించి తీవ్రంగా నిరాశ పరిచాయి.
దాదాపు ఏడెనిమిది ఏళ్ళ కిందటి మాట ఇది. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ హీరోలుగా నటించిన ప్రతి సినిమాలు అవలీలగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరేవి. హిట్ ప్లాప్‌కు సంబంధం లేకుండానే వారు నటించిన సినిమాలు మంచి ఓపెనింగ్స్ రాబట్టేవి. ఇక సినిమా సూపర్ హిట్ అయితే లైఫ్ టైం కలెక్షన్స్ రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు కలెక్షన్లు సాధించేవి. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సినిమాలు కూడా ఇదే విధంగా వసూళ్లు సాధించేవి. అయితే ఇదంతా గతం. బాలీవుడ్‌లో ఇప్పుడు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి.
కోవిడ్ తర్వాత బాలీవుడ్‌లో సరైన విజయాలు దక్కడం లేదు. పోనీ ఈ పరిస్థితి అందరికీ వర్తిస్తుందా.. అంటే అదీ లేదు. తెలుగు నుంచి వెళ్తున్న సినిమాలు, కన్నడ కేజీఎఫ్ సినిమా వంటి సినిమాలు అక్కడ రికార్డు స్థాయి ఓపెనింగ్స్ తో పాటు భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. అయితే దీనిపై బాలీవుడ్ ప్రముఖులు ఒక మంచి హిందీ సినిమా పెడితే చాలని అంతా కుదురుకుంటుందని తరచూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్లు నటించిన సినిమాలు విడుదలైనా వాటిని థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు మొహం చాటేస్తున్నారు. ఈ వారం అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ హీరోగా నటించిన రక్షాబంధన్ సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు కలిపి మొదటి రోజు రూ.20 కోట్లు లోపే వసూళ్లు సాధించి తీవ్రంగా నిరాశ పరిచాయి. అమీర్ ఖాన్ సినిమాలు హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా మొదటి రోజు రూ.50 కోట్ల వరకు వసూళ్లు సాధిస్తుంటాయి. ఆయన హీరోగా నటించి డిజాస్టర్ గా నిలిచిన గత చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా రిలీజ్ రోజే రూ.50 కోట్ల వసూళ్లు సాధించింది.
అక్షయ్ కుమార్ హీరోగా నటించే సినిమాలకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చేవి. తాజాగా ఆయన నటించిన రక్షాబంధన్ సినిమాకు ఓపెనింగ్స్ సరిగా రాలేదు. బాలీవుడ్ లో కోవిడ్ తర్వాత విడుదల అవుతున్న ఈ రెండు సినిమాలు బాలీవుడ్ లో విజయాల దాహం తీరుస్తాయని సినీ విశ్లేషకులు భావించినప్పటికీ ఈ రెండు సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. కాగా ఈ రెండు సినిమాల పరిస్థితి ఈ విధంగా ఉండగా.. తెలుగు హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న లైగర్ సినిమాకు అక్కడ భారీ బజ్ ఏర్పడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక ఈ సినిమా కూడా హిట్ అయితే బాలీవుడ్ మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.