Mahesh Babu | మహేష్ అంతర్జాతీయ స్థాయి

Mahesh Babu - మహేష్ బాబుతో భవిష్యత్తులో సినిమా కష్టమని తేల్చేశారు దర్శకుడు కృష్ణవంశీ. ఆయనది అంతర్జాతీయ స్థాయి అంటున్నారు.

Advertisement
Update: 2024-07-29 07:54 GMT

మహేష్ తో పని చేసిన దర్శకులంతా అతడ్ని పొగడ్తల్లో ముంచెత్తుతారు. ఇదేదో మొహమాటానికి చేసే పని కాదు. మహేష్ దర్శకుల హీరో. ఒక్కసారి కథ-స్క్రీన్ ప్లే లాక్ అయితే.. దర్శకుడు చెప్పింది మాత్రమే చేస్తాడు. కథ కోసం, తను పోషించే పాత్ర కోసం ప్రాణం పెడతాడు. ఎంత కష్టపడాలో అంత కష్టపడతాడు.

అందుకే మహేష్ అంటే ప్రతి దర్శకుడికి ఇష్టం. ఇదే ఇష్టాన్ని కృష్ణవంశీ కూడా బయటపెట్టారు. మహేష్ అంటే తనకు ప్రేమ అంటున్నారు ఈ సీనియర్ దర్శకుడు. మహేష్ హీరోగా మురారి సినిమా తీసిన ఈ డైరక్టర్, మహేష్ వెయ్యి శాతం కష్టపడే హీరో అని చెప్పుకొచ్చాడు.

ఇక మహేష్ తో మరో మూవీ చేసే అవకాశం ఉందా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమా తర్వాత అతడు అంతర్జాతీయ స్థాయి హీరో అవుతాడట. అలాంటి హీరోతో తను సినిమా చేయడం దాదాపు కష్టం అని తేల్చేశారు కృష్ణవంశీ.

ప్రస్తుతం హాలీవుడ్ లో డేనియల్ క్రెగ్ గడువు పూర్తయిందని, కాబట్టి భవిష్యత్తు జేమ్స్ బాండ్ గా మహేష్ బాబు నటిస్తే చూడాలని ఉందంటూ తన మనసులో కోరిక బయటపెట్టారు. 

Tags:    
Advertisement

Similar News