కృష్ణంరాజుతో నాది 50 ఏళ్ల స్నేహం - సూపర్ స్టార్ కృష్ణ

రెబల్ స్టార్ కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. తమది 5 దశాబ్దాల బంధం అంటున్నారు.

Advertisement
Update:2022-09-11 15:25 IST

నటుడు, రాజకీయనాయకుడు రెబల్ స్టార్ కృష్ణంరాజుతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు హీరో కృష్ణ. వీళ్లిద్దరూ ఒకేసారి ఇండస్ట్రీలో అడుగుపెట్టారట. ఒకే సినిమాకు ఆడిషన్ కు వెళ్లారట. కాకపోతే తను ముందుగా హీరో అయ్యానని, ఆ తర్వాత తమ స్నేహం 5 దశాబ్దాల పాటు కొనసాగిందని చెప్పుకొచ్చారు కృష్ణ.

"50 ఏళ్ల స్నేహం మాది. తేనెమనసులు సినిమా ఆడిషన్స్ కు నాతో పాటు కృష్ణంరాజు వచ్చాడు. అదే మొదటిసారి. ఆ సినిమాతో నేను హీరోగా పరిచయమయ్యాను. అతను చిలక-గోరింక సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యారు. నేనంటే నేనే సినిమాలో మేమిద్దరం తొలిసారి కలిసి నటించాం. అందులో నేను హీరోగా నటిస్తే, కృష్ణంరాజు తొలిసారి విలన్ గా నటించారు. అక్కడ్నుంచి మా ప్రయాణం మొదలైంది. నా సినిమాల్లో సెకెండ్ హీరోగా, విలన్ గా చాలా సినిమాలు చేశారు. అతను హీరోగా సక్సెస్ అయిన తర్వాత కూడా నాతో సినిమాలు చేశారు."

ఇలా కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు కృష్ణ. కృష్ణంరాజు ఇంటికి వెళ్లి, ఆయన పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. కృష్ణంరాజు ఈ లోకాన్ని వీడి వెళ్లడం తనకు చాలా బాధగా ఉందన్న కృష్ణ, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.



Tags:    
Advertisement

Similar News