కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మెగా హీరో
కొండ గట్టు అంజన్నను మెగా హీరో వరుణ్ తేజ్ ఇవాళ దర్శించుకున్నారు. దీంతో ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ఫకుంభ స్వాగతం పలికారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను మెగా హీరో వరుణ్ తేజ్ ఇవాళ దర్శించుకున్నారు. దీంతో మెగా హీరోకు అర్చకులు, అధికారులు పుర్ణకుంభ స్వాగతం పలికారు. అంజనేయస్వామికి ప్రత్యేక పూజాలు నిర్వహించిన ఆయనకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు, స్వామి వారి చిత్ర పటం అందజేశారు. ఈ సందర్బంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ కొండగట్టు అంజన్న చాల మహిళగల దేవుడని, మొదటిసారి హనుమన్ దీక్ష తీసుకున్నా అంజన్న దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
కొత్త సినిమా షూటింగ్ కి ఇంకా సమయ ఉండటంతో హనుమాన్ దీక్ష చేపట్టారు. రాబోయే సినిమాలతో హిట్ అంజన్నను కోరుకుటున్నారు. గతంలో ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ వంటి సినియమాలతో మంచి హిట్లు అందుకున్న వరుణ్ కెరీర్ ప్రస్తుతం పడిపోయింది. ఆపరేషన్ వాలంటౌన్, గాండీవ దారి అర్జున, గని వంటి చిత్రలలు వరుస డిజాస్టర్లను దక్కించుకున్నారడు. ఇటీవల విడుదలైన మట్కా మూవీ కూడా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.