Kiran Abbavaram | ఓ ఇంటివాడు కాబోతున్న హీరో

Kiran Abbavaram - హీరో కిరణ్ అబ్బవరం వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నాడు. ఓ హీరోయిన్ ను అతడు పెళ్లాడబోతున్నాడు.

Advertisement
Update:2024-03-11 22:51 IST

టాలీవుడ్ లో మరో హీరో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అతడే కిరణ్ అబ్బవరం. టాలీవుడ్ లో ఓ మోస్తరుగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, కిరణ్ అబ్బవరం తొలి సినిమాలో హీరోయిన్.

రాజావారు రాణిగారు అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఇదే సినిమాతో రహస్య హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమా టైమ్ లోనే వీళ్లిద్దరి మనసులు కలిశాయి. అప్పట్నుంచి ఇద్దరూ డేటింగ్ లోనే ఉన్నారు. ఇప్పుడు తమ బంధాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇంట్లో పెద్దల్ని ఒప్పించారు.

బుధవారం కిరణ్-రహస్య ఎంగేజ్ మెంట్ జరుగుతుంది. నిశ్చితార్థం తర్వాత పెళ్లి తేదీని ప్రకటిస్తారు. అలా తన ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చాడు కిరణ్ అబ్బవరం.

ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాతో సక్సెస్ కొట్టిన ఈ హీరో, ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలు అందుకోలేకపోయాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన మీటర్, వినరో భాగ్యము విష్ణుకథ లాంటి సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కిరణ్ కెరీర్ కాస్త మందగించింది. త్వరలోనే అతడు తన కొత్త సినిమాలతో పలకరించబోతున్నాడు.




Tags:    
Advertisement

Similar News