బ్యానర్ నాదే.. నిర్మాత మాత్రం నేను కాదు

బింబిసార సినిమా కోసం తను కేవలం ఓ నటుడిగా మాత్రమే పనిచేశానంటున్నాడు కల్యాణ్ రామ్. నిర్మాత బాధ్యతల నుంచి తప్పుకున్నాడట.

Advertisement
Update:2022-07-27 17:40 IST

బింబిసార మూవీ రివ్యూ

రెండు పడవల ప్రయాణం చేయడం ఎంత కష్టమో, ఎంత నరకమో అనుభవపూర్వకంగా తెలుసుకున్నానంటున్నాడు హీరో కల్యాణ్ రామ్. తను స్థాపించిన నందమూరి తారకరామారావు ఆర్ట్స్ అనే బ్యానర్ తనదే అయినప్పటికీ, ప్రస్తుతం తను నిర్మాతను కాదంటున్నాడు. నిర్మాత అనే పాత్రను భవిష్యత్తులో కూడా పోషించనని చెబుతున్నాడు.

"ప్రొడ్యూసర్ రోల్ నుంచి నేను బయటకొచ్చేశాను. నా సినిమాలకు నేను ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం లేదు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి బ్యానర్ పెట్టాను. కానీ కొన్ని సినిమాల తర్వాత రెండు పడవల ప్రయాణం మంచిది కాదని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అందుకే ప్రొడ్యూసర్ అనే రోల్ ను నా నుంచి తీసేశాను. ప్రస్తుతం నేను హీరోను మాత్రమే. క్రియేటివ్ కోణంలోనే నా ప్రయాణం సాగిస్తున్నాను."

ఇలా ప్రొడ్యూసర్ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయాన్ని బయటపెట్టాడు కల్యాణ్ రామ్. ఇక బింబిసార సినిమా విషయానికొస్తే, లాక్ డౌన్ టైమ్ లో ఎన్నో సార్లు బింబిసార పాత్ర గురించి వినడం వల్ల, సెట్స్ పైకి వెళ్లినప్పుడు పెద్దగా ఇబ్బంది కలగలేదంటున్నాడు.

"నెగెటివ్ షేడ్ చేశాను. ఎలా చేద్దామనే ఆలోచన నాకు లేదు. కాకపోతే కరోనా వల్ల నాకు టైమ్ దొరికింది. ఆ టైమ్ లో దర్శకుడు వశిష్ట రోజూ నాకు బింబిసార పాత్ర గురించి చెబుతూనే ఉన్నాడు. ప్రతి రోజూ అలా వింటూనే ఉన్నాను. రోజుకు 15-20 సార్లు వినేవాడ్ని. దీంతో ఆ పాత్ర నాలో జీర్ణించుకుపోయింది. దీంతో సెట్స్ పైకి వెళ్లిన తర్వాత ఆటోమేటిగ్గా ఆ పాత్ర నా నుంచి బయటకు వచ్చేసింది."

ఆగస్ట్ 5 న థియేటర్లలోకి రాబోతోంది బింబిసార. వశిష్ఠ దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, క్యాథరీన్ హీరోయిన్లుగా నటించారు. 


Full View


Tags:    
Advertisement

Similar News