Kalki Ticket Rates | నైజాంలో కల్కి టికెట్ రేట్లు

Kalki Ticket Rates in Nizam - నైజాంలో కల్కి సినిమాకు లైన్ క్లియర్ అయింది. టికెట్ రేట్లు ఫిక్స్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోతోంది.

Advertisement
Update: 2024-06-24 03:45 GMT

ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా రిలీజ్ ట్రయిలర్ కూడా మార్కెట్లోకి వచ్చేసింది. రెండో ట్రయిలర్ తో సినిమాపై ఓ ఐడియాకు వచ్చారు జనం. దీంతో అంచనాలు మరింత పెరిగాయి.

ఈ అంచనాలకు తగ్గట్టే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డ్ సృష్టిస్తోంది కల్కి. ఇప్పటికే అక్కడ 2.5 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించినట్టయింది. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వంతు.

ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచాల్సిందిగా ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకున్నారు నిర్మాత. ఇందులో భాగంగా తెలంగాణ సర్కారు నుంచి ప్రత్యేక అనుమతి లభించింది. నైజాంలో ఉదయం 5.30కు స్పెషల్ షో వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కారు.

దీంతో పాటు 27వ తేదీ నుంచి 8 రోజుల పాటు రోజుకు 5 షోలు వేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. ఇక టికెట్ రేట్ల విషయానికొస్తే, మల్టీప్లెక్సుల్లో 100 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 75 రూపాయలు పెంచుకునేలా ప్రత్యేక జీవో పాస్ చేసింది.

27న వేసే 5.30ని. షోకు మాత్రం టికెట్ పై 200 రూపాయల వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా నటించారు. అమితాబ్ కీలక పాత్ర పోషించగా.. దీపిక పదుకోన్, దిశా పటానీ హీరోయిన్లుగా నటించారు.

Tags:    
Advertisement

Similar News