Allu Arjun | పవన్ కల్యాణ్ కాళ్లు బన్నీ కడగాలంట!

Allu Arjun - అల్లు అర్జున్ పై జనసేన దాడి మొదలైంది. మొన్న బొలిశెట్టి, నిన్న చలమలశెట్టి.

Advertisement
Update:2024-08-29 18:00 IST

అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా జనసేన పార్టీలో నిరసన గళం పెరుగుతోంది. నిన్నటికిమొన్న బొలిశెట్టి శ్రీనివాస్, బన్నీపై విమర్శలు చేశారు. అల్లు అర్జున్ ఆర్మీని షామియానా కంపెనీతో పోల్చారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో నేత కూడా చేరారు.

జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, బన్నీపై విరుచుకుపడ్డారు. పబ్లిక్ గా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే పుష్ప-2ను రిలీజ్ చేయనివ్వమని వార్నింగ్ ఇచ్చారు.

"మెగాస్టార్ దేశం మొత్తానికి మార్గదర్శి. అలాంటి కుటుంబం నుంచి వచ్చి నువ్వు నేర్చుకున్న సంస్కారం ఏంటి? నువ్వు మాట్లాడిన మాటలకు క్షమాపణలు కోరుతూ.. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు కాళ్లు కడిగి ఆ నీళ్లు పబ్లిక్ గా మీడియా ముందు నెత్తిన పోసుకో. లేదంటే డిసెంబర్ 6న గన్నవరం నియోజకవర్గంలో ఎక్కడా పుష్ప-2 రిలీజ్ కానివ్వం. ఒక్క ఫ్లెక్సీ కూడా కనిపించదు. ఇదే నా ఛాలెంజ్."

అల్లు అర్జున్ హీరో కాదంటున్నారు రమేష్. అతడు తనకు ఓ కమెడియన్ మాదిరిగా కనిపిస్తారని ఎద్దేవా చేశారు. తనకు పెద్ద ఆర్మీ ఉందని బన్నీ ఎప్పుడూ చెప్పుకుంటాడని, ఆ సైన్యం ఎంత ఉందో డిసెంబర్ 6న గన్నవరంలో చూపించాలని, అదేంటో తను కూడా చూస్తానని అన్నారు.

కాస్త సైలెంట్ అయిన బొలిశెట్టి..

అటు బొలిశెట్టి, బన్నీపై తను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. అయితే ఆ వివాదానికి సంబంధించి మళ్లీ రియాక్ట్ అవ్వనని కూడా తేల్చారు. అల్లు అర్జున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, దానికి తను కౌంటర్ ఇచ్చానని, అక్కడితో అది అయిపోయిందని, మళ్లీ అల్లు అర్జున్ ఏదైనా మాట్లాడితే తప్పకుండా తను రియాక్ట్ అవుతానని అన్నారు.

పవన్ కల్యాణ్ ఆదేశాలతోనే జనసేన నేతలు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారా.. లేక తన నాయకుడితో సంబంధం లేకుండా స్వతంత్రంగానే విమర్శలు చేస్తున్నారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు పార్టీ నుంచి మాత్రం ఒక్కొక్కరుగా బయటకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. 

Tags:    
Advertisement

Similar News