దిల్ రాజు బ్యాన‌ర్ లో సుహాస్ కొత్త సినిమా.. టైటిల్ భ‌లే ఉంది బాసు!

ఈ సినిమాకు జ‌నక అయితే గ‌న‌క అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను మేక‌ర్స్ ఖ‌రారు చేశారు. దిల్ రాజు ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్ పై హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షితా రెడ్డిలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement
Update:2024-07-02 15:04 IST

టాలీవుడ్ లో కమెడియన్ నుంచి హీరోగా ఎదిగిన నటుల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటో తో క‌థానాయకుడిగా మారిన సుహాస్‌.. తొలి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత వినూత్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ మినిమమ్ హిట్ గ్యారెంటీ అనే ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీతో క్రేజీ హిట్ కొట్టిన సుహాస్‌.. రీసెంట్ గా ప్రసన్నవదనంతో ప్రేక్షకులను పలకరించాడు.

ఈ చిత్రానికి కూడా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ప్రస్తుతం సుహాస్ ఆనందరావ్‌ అడ్వంచర్స్, కేబుల్ రెడ్డి అనే చిత్రాలు చేస్తున్నాడు. తాజాగా సందీప్ రెడ్డి బండ్ల ద‌ర్శ‌క‌త్వంలో మరొక కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు జ‌నక అయితే గ‌న‌క అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను మేక‌ర్స్ ఖ‌రారు చేశారు. దిల్ రాజు ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్ పై హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షితా రెడ్డిలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఆనందం - ప‌ట్టలేనంత‌.. బాధ‌లు - చెప్పుకోలేనంత‌.. న‌వ్వులు - ఆపుకోలేనంత అంటూ మేక‌ర్స్ జ‌నక అయితే గ‌న‌క టైటిల్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. జూలై 4న టీజ‌ర్ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించారు. టైటిల్ పోస్ట‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఫార్మ‌ల్ డ్రెస్సింగ్ లో త‌ల‌ప‌ట్టుకుని ఓర‌గా ఓ కంటితో చూస్తూ సుహాస్ క‌నిపించాడు.

అలాగే న్యాయ‌దేవత బొమ్మ‌, కిడ్స్ కు సంబంధించిన స్కూల్ బ్యాగ్‌, స్కూల్ బ‌స్‌, టెడ్డీ బేర్, కేక్‌ బొమ్మ‌ల‌తో పోస్ట‌ర్ ను డిజైన్ చేశారు. వీట‌న్నిటి బ‌ట్టీ చూస్తుంటే.. జ‌నక అయితే గ‌న‌క సినిమా ఫుల్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా వ‌స్తుంద‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానున్నాయి.

Tags:    
Advertisement

Similar News