NBK109.. బాల‌య్య‌కు జోడిగా మ‌ళ్లీ ఆ హీరోయిన్‌నే..!

ఎన్‌బీకే 109 మూవీలో బాల‌య్య‌కు జోడిగా ప్ర‌ముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అల‌రించబోతోంద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్ లో బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement
Update: 2024-06-30 10:24 GMT

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లితో ఒక సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 109వ చిత్రం కావడంతో.. NBK109 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను గత ఏడాది ప్రారంభించారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి వ‌రుస విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌ర్వాత బాల‌య్య చేస్తున్న ప్రాజెక్ట్ ఇది.

ప్ర‌స్తుతం కర్నూల్ జిల్లా ఓర్వకల్లులోని రాక్ గార్డెన్ లో షూటింగ్ జరుగుతోంది. కొన్ని కీల‌క‌మైన‌ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను అక్క‌డ చిత్రీక‌రిస్తున్నారు. 50 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమాలో బాల‌య్య‌ను ఢీ కొట్టే విల‌న్ పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ న‌టిస్తున్నారు. అలాగే ఊర్వశి రౌటేలా కూడా మూవీ కాస్ట్ లో ఉంది. కానీ ఇంత వ‌ర‌కు ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌రు అన్న‌ది మాత్రం చిత్ర యూనిత్ అనౌన్స్ చేయ‌లేదు.

అయితే తాజాగా హీరోయిన్ విష‌యంలో స‌స్పెన్స్ వీడిన‌ట్లు అనిపిస్తోంది. ఎన్‌బీకే 109 మూవీలో బాల‌య్య‌కు జోడిగా ప్ర‌ముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అల‌రించబోతోంద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్ లో బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో బాలకృష్ణ‌, ప్ర‌గ్యా జంట‌గా అఖండ చేశారు. ఈ సినిమా భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. అలాగే బాల‌య్య‌, ప్ర‌గ్యా పెయిర్ కూడా బాగుంద‌నే ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలోనే డైరెక్ట‌ర్ బాబీ త‌న సినిమాలో బాల‌య్య‌కు జోడిగా మ‌రోసారి ప్ర‌గ్యా జైస్వాల్ నే తీసుకున్నార‌ని టాక్ న‌డుస్తోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. కాగా, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా బాల‌య్య సినిమాను నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News