జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్‌

నేషనల్‌ అవార్డు తీసుకోవడానికి ఈ నెల 6-10 తేదీ వరకు బెయిల్‌ మంజూరు

Advertisement
Update:2024-10-03 11:29 IST

అస్టిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. నేషనల్‌ అవార్డుల కార్యక్రమానికి హాజరుకావడానికి గాను బెయిల్‌కోసం దరఖాస్తు చేసుకోగా....పరిశీలించిన రంగారెడ్డి కోర్టు ఈ నెల 6-10 తేదీ వరకు కోర్టు బెయిల్‌ ఇచ్చింది.

జానీ మాస్టర్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆయన అసిస్టెంట్‌ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017లో జానీ మాస్టర్‌ పరిచయమయ్యాడని, 2019లో ఓ సినిమా చిత్రీకరణ కోసం ముంబై వెళ్లాం. అక్కడ హోటల్‌లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని.. ఈ విషయం ఎవరికైనా పని నుంచి తొలిగిస్తానని, సినీ పరిశ్రమలో ఎప్పటికీ పనిచేయలేవని బెదించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని హైదరాబాద్‌ సహా ఇతర ప్రాంతాలకు షూటింగ్‌లకు వెళ్లినప్పుడు పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకుఅత్యాచారం , పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న ఆయనను అరెస్టు చేశారు.

జానీ మాస్టర్‌ను ఇటీవల పోలీస్‌ కస్టడీకి కోర్టు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. థర్డ్‌ డిగ్రీ ప్రయోగించవద్దని.. అవసరమైతే న్యాయవాది సమక్షంలో విచారించాలని ఆ సమయంలో సూచించింది. ఈ నెల 28 వరకు నార్సింగి పోలీసులు ఆయనను ప్రశ్నించారు. అయితే ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డులలో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జానీమాస్టర్‌కు ఇటీవల నేషనల్‌ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెలలో జరగనున్న అవార్డుల ప్రదానోత్సవానికి హాజరై.. పురస్కారం అందుకోవడం కోసం ఆయన పెట్టుకున్న బెయిల్‌ దరఖాస్తు పరిశీలించిన కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Tags:    
Advertisement

Similar News