Harish Shankar | తప్పనిసరి పరిస్థితుల మధ్య వస్తున్నాం

Harish Shankar - గురువు పూరి జగన్నాధ్ తీసిన డబుల్ ఇస్మార్ట్ కు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తున్నాడు హరీశ్ శంకర్.

Advertisement
Update:2024-07-29 13:30 IST

ఆగస్ట్ 15కి గట్టి పోటీ మొదలైంది. పూరి జగన్నాధ్ తీసిన డబుల్ ఇస్మార్ట్ కు పోటీగా, హరీశ్ శంకర్ తీసిన మిస్టర్ బచ్చన్ సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నారు. నిజానికి ఇలాంటి సందర్భాల్లో రామ్ పోతినేని వెర్సెస్ రవితేజ అంటూ కథనాలు రావాలి.

కానీ ఇక్కడ పూరి వెర్సెస్ హరీశ్ శంకర్ అంటూ కథనాలు వస్తున్నాయి. దీనికి కారణం వీళ్లిద్దరూ గురుశిష్యులు కావడం, పైగా గతంలో హరీశ్-చార్మి పై కొన్ని వివాదాస్పద కథనాలు రావడం. ఈ పోటీపై స్వయంగా హరీశ్ స్పందించాడు. తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వస్తోందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

"పూరి జగన్నాధ్ తో ఎక్కువగా వర్క్ చేశాను. ఆయన నాకు గురువు. ఆయనతో నన్ను నేను పోల్చుకునే స్థాయి కాదు నాది. ఆయన లెజెండ్ డైరక్టర్. మాకున్న ఆర్థిక కారణాల వల్ల, ఓటీటీ ఇష్యూల వల్ల ఆగస్ట్ 15కు మిస్టర్ బచ్చన్ ను రిలీజ్ చేయాల్సి వస్తోంది. ఈ తేదీకి ముందుగా రిలీజ్ డేట్ ను ప్రకటించింది డబుల్ ఇస్మార్ట్ సినిమానే. అది నేను అంగీకరిస్తున్నాను. మాకు ఆ తేదీకి వచ్చే ఉద్దేశం లేదు. మైత్రీ శశి ఫోర్స్ చేయడంతో వస్తున్నాం. లేదంటే మేం కాస్త రిలాక్స్ గానే వద్దాం అనుకున్నాం. పుష్ప-2 పోస్ట్ పోన్ అవ్వడం, మా యూనిట్ కు ఉన్న కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో పూరి సినిమాకు పోటీగా వస్తున్నాం."

ఒక్క సినిమా క్లాష్ అవ్వడం వల్ల పూరికి తనకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రాదని అంటున్నాడు హరీశ్. ఇలాంటి విషయాలు పట్టించుకునే స్థాయి పూరిది కాదన్నాడు. 

Tags:    
Advertisement

Similar News