మీరు గర్వపడేలా పెర్ఫారెన్స్‌ ఇస్తా

'గేమ్‌ ఛేంజర్‌' విషయంలో మా కష్టానికి తగ్గ ఫలితం దక్కినందుకు ఈ సంక్రాంతికి మరింత ఆనందంగా ఉన్నదన్న రామ్‌ చరణ్‌

Advertisement
Update:2025-01-14 15:39 IST

తన కొత్త సినిమా 'గేమ్‌ ఛేంజర్‌' విజయాన్ని హీరో రామ్‌ చరణ్‌ ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సినిమాను ఆదరించిన అభిమానులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు. తన హృదయంలో ఈ మూవీకి ప్రత్యేక స్థానం ఉందన్నారు. మీరు గర్వపడేలా.. అద్భుతమైన పెర్ఫారెన్స్‌ ఇవ్వడం కొనసాగిస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు.

'గేమ్‌ ఛేంజర్‌' విషయంలో మా కష్టానికి తగ్గ ఫలితం దక్కినందుకు ఈ సంక్రాంతికి మరింత ఆనందంగా ఉన్నది. సినిమాకు పనిచేసిన వారందరికీ అభినందనలు. మీ (అభిమానులు, ప్రేక్షకులు) ప్రేమ అభిమానానికి కృతజ్ఞుడిని. ఎంతగానో సపోర్ట్‌ చేసిన మీడియాకు స్పెషల్‌ థాంక్స్‌. మీరు గర్వపడే ప్రదర్శనను కొనసాగిస్తానని పాజిటివ్‌ ఎనర్జీతో కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన సందర్భంగా హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు.

శంకర్‌ డైరెక్షన్‌లో రామ్‌ చరణ్‌ నటించిన 'గేమ్‌ ఛేంజర్‌' ఈ నెల 10న విడుదలైంది. అప్పన్న (రాజకీయ నాయకుడు), రామ్‌ నందన్‌ (ఐఏఎస్‌) పాత్రల్లో భిన్న పాత్రల్లో విభిన్న గెటప్పుల్లో చరణ్‌ అభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నది. విజువల్స్‌, తమన్‌ సంగీతం ఆడియన్స్‌ అలరించాయి.

Tags:    
Advertisement

Similar News