Gam Gam Ganesha | మొదటి రోజు మెరిసిన ఆనంద్ దేవరకొండ సినిమా

Gam Gam Ganesha - ఆనంద్ దేవరకొండ తాజా చిత్రం గం గం గణేశ. మొదటి రోజు మెరిసింది ఈ సినిమా.

Advertisement
Update:2024-06-01 22:56 IST

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా గం గం గణేశ. ఈ సినిమా థియేట్రికల్ జర్నీ నిన్నట్నుంచి మొదలైంది. మొదటి రోజు సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిందని అంటోంది టీమ్. నిన్న వరల్డ్ వైడ్ థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు 1.82 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుంది.

క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కిన "గం..గం..గణేశా" ఆడియెన్స్ కు హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది. ఈ రోజు రేపు వీకెండ్ కాబట్టి బాక్సాఫీస్ నెంబర్స్ మరింతగా పెరుగుతాయని నమ్మకంగా చెబుతున్నారు.

"గం..గం..గణేశా"లో ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. "గం..గం..గణేశా" సినిమాలో మంచి ఎనర్జిటిక్ క్యారెక్టర్ పోషించాడు ఆనంద్. 

Tags:    
Advertisement

Similar News