'ఈ అమ్మాయిలా పోరాడండి' అని సమంత తాజా పోస్ట్‌

నాగచైతన్య, శోభిత పెళ్లి తర్వాత సమంత పెట్టిన తొలి పోస్టు ఇదే కావడంతో పోస్ట్‌ వైరల్‌

Advertisement
Update:2024-12-05 14:57 IST

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత తాజాగా పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. సమంత బంధువు నిక్‌డోస్‌ పెట్టిన పోస్టును సామ్‌ షేర్‌ చేశారు. 'ప్రపంచంలో మంచి వదినలు కూడా ఉంటారు. మా వదినను నేను ఎప్పటికీ ప్రేమిస్తుంటాను' అని నిక్‌డోస్‌ పోస్టు పెట్టారు. దాన్ని షేర్‌ చేసిన సమంత లవ్‌ యూ అని పేర్కొన్నారు. తన ఇన్‌స్టా స్టోరీలో 'సిటడెల్‌' టీమ్‌తో దిగిన ఫొటోను కూడా సమంత పంచుకున్నారు. ఇంత గొప్ప టీమ్‌తో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభూతి అని రాసుకొచ్చారు. 'సిటడెల్‌:హనీ బన్నీ' కోసం రాజ్‌ అండ్‌ డీకేతో వర్క్‌ చేయడం నిజంగా గర్వంగా ఉందన్నారు.

ఎప్పుడూ ఇన్‌స్టాలో స్ఫూర్తిమంతమైన వీడియోలను సమంత పంచుకునే విషయం విదితమే. తాజాగా అలాంటి వీడియోనే పంచుకున్నారు. అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగే కుస్తీ పోటీ వీడియోను షేర్‌ చేశారు. దాని ప్రారంభంలో అబ్బాయి పూర్తి ఆత్మవిశ్వాసంతో మ్యాచ్‌లోకి వస్తాడు. కానీ, పోటీ ముగిసేకొద్దీ అతడు అమ్మాయి చేతిలో ఓడిపోతాడు. ఈ వీడియోకు సమంత 'ఈ అమ్మాయిలా పోరాడండి' అని క్యాప్షన్‌ పెట్టారు. ప్రస్తుతం సమంత ఇన్‌స్టా స్టోరీలు వైరల్‌గా మారాయి. అభిమానులు వీటి గురించి చర్చించుకుంటున్నారు. నాగచైతన్య, శోభిత పెళ్లి తర్వాత సమంత పెట్టిన తొలి పోస్టు ఇదే. ఇందులో మర్చిపోలేని జర్నీ అంటూ సంచలన క్యాప్షన్‌ పెట్టడం వారిని ఉద్దేశించేనా అని చర్చించుకుంటున్నారు. ఇక చైతు, శోభితల పెళ్లి వేడుకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో కుటుంబసభ్యులు, కొద్దిమంది అతిథుల మధ్యలో వాళ్ల పెళ్లి సంప్రదాయబద్ధంగా జరిగినట్లు సమాచారం.

Tags:    
Advertisement

Similar News