ఇండియ‌న్ సినిమా హిస్టరీలోనే ఒకేఒక్క‌డు.. ఇకపై ప్ర‌భాస్‌ను ఆపేదెవ‌డు?

ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ ఎవరు అంటే కచ్చితంగా ఇప్పుడు ప్రభాస్ పేరే వినపడుతోంది.

Advertisement
Update: 2024-06-29 07:28 GMT

ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ ఎవరు అంటే కచ్చితంగా ఇప్పుడు ప్రభాస్ పేరే వినపడుతోంది. బాహుబలి సిరీస్ తో నేషనల్ వైడ్ గా భారీ మార్కెట్ ను సంపాదించుకున్న ప్రభాస్.. ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్‌, సలార్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. వీటిలో రాధేశ్యామ్ మినహా మిగిలిన చిత్రాలన్నీ టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద మాస్ రాంపెజ్ చూపించాయి.

తాజాగా ప్ర‌భాస్ నుంచి వ‌చ్చిన మ‌రో బిగ్గెస్ట్ మూవీ క‌ల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ ఫాంటసీ ఫిల్మ్ తొలి ఆట నుంచే సూప‌ర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. క‌ల్కి రిలీజ్ తో ఇండియ‌న్ సినిమా హిస్టరీలోనే ఏకంగా ఐదు సార్లు రూ. 100 కోట్ల‌కు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన ఒకేఒక్క‌డిగా ప్ర‌భాస్ అరుదైన రికార్డును నిల‌కొల్పాడు.

ప్ర‌భాస్ కెరీర్ లో బాహుబలి2 మూవీ మొదటి సారి మొద‌టి రోజు రూ. 215 కోట్ల మార్క్ ని దాటింది. ఆ త‌ర్వాత సాహో రూ. 126 కోట్లు, ఆదిపురుష్ రూ. 137 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా.. గ‌త ఏడాది విడుద‌లైన‌ సలార్ మూవీ మొద‌టి రోజు రూ. 167 కోట్ల మార్క్ ని అందుకుంది.

ఇక తాజాగా విడుద‌లైన క‌ల్కి చిత్రం రూ. 191.5 కోట్ల గ్రాస్ తో బాక్సాఫీస్ ర‌న్ ను ప్రారంభించింది. ఓపెనింగ్స్ పరంగా మిగిలిన ఇండియ‌న్ స్టార్ హీరోలెవ్వరు ప్రభాస్ దరి దాపుల్లో కూడా లేరు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఇక‌పై మా ప్ర‌భాస్ ను ఆపేదెవ‌డంటూ అభిమానులు కాల‌ర్ ఎగ‌రేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News