Dulquer Salman | దుల్కర్ తెలుగు సినిమా ప్రారంభం

Dulquer Salman - దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా లాంఛ్ అయింది. వెంకీ అట్లూరి దర్శకుడు. మీనాక్షి చౌదరి హీరోయిన్.

Advertisement
Update:2023-09-24 22:52 IST

దుల్కర్ సల్మాన్.. సౌత్ తో మంచి డిమాండ్ ఉన్న హీరో. 'సీతారామం' తర్వాత, ఆయన దర్శకుడు వెంకీ అట్లూరితో తెలుగులో తన తదుపరి చిత్రం 'లక్కీ భాస్కర్'ను ప్రకటించిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గత కొన్నేళ్లుగా విభిన్న చిత్రాలను అందిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత చురుకైన నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. వారు ఇప్పుడు పాన్-ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టారు. 'సార్' సినిమా తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరితో ఇది వారి రెండవ పాన్-ఇండియా చిత్రం.

'లక్కీ భాస్కర్' షూటింగ్ సెప్టెంబర్ 24న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు, దర్శకుడు, నటీనటులు పాల్గొని సినిమాపై ఎంతో నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్కీ భాస్కర్ నేపథ్యాన్ని కూడా వెల్లడించారు మేకర్స్.

ఒక సాధారణ మనిషి, ఎవరూ ఊహించని అసాధారణమైన ప్రయాణం చేసి, కొలవలేని ఎత్తులకు చేరుకుంటాడు. అలా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి ప్రయాణమే ఈ లక్కీ భాస్కర్. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కు జోడీగా మీనాక్షి చౌదరి నటించనుంది. పూజా కార్యక్రమాలకు ఆమె కూడా హాజరైంది.




Tags:    
Advertisement

Similar News