ముద్దుగుమ్మకు గ్యాప్ రాలేదంట.. ఇచ్చిందంట!

'రామారావు'పై గంపెడాశలు పెట్టుకుంది దివ్యాంశ కౌశిక్. ఈసారి టాలీవుడ్ లో జెండా పాతేస్తానంటోంది ఈ ముద్దుగుమ్మ.

Advertisement
Update:2022-07-24 12:16 IST

దివ్యాంశ కౌషిక్.. ఈ పేరు గుర్తుందా. అప్పుడెప్పుడో మజిలీ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ కు దూరమైంది. మళ్లీ ఇన్నాళ్లకు రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో తెరపైకొచ్చింది. మరి ఇన్నాళ్లూ ఈ బ్యూటీ ఏమైంది? ఎందుకు గ్యాప్ తీసుకుంది? రామారావు ఆన్ డ్యూటీలో ఎలా అవకాశం వచ్చింది? ఈ ప్రశ్నలకు స్వయంగా సమాధానమిచ్చింది దివ్యాంశ.

"కోవిడ్ తో అందరికీ కామన్ గా గ్యాప్ వచ్చింది. దీంతో పాటు తెలుగు నేర్చుకున్నాను, డ్యాన్స్ క్లాసులు తీసుకున్నాను. అలాగే నన్ను నేను మలచుకోవడానికి వర్కవుట్ చేశాను. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఇనస్టాగ్రామ్ లో కొన్ని ట్రెడిషినల్ ఫోటోలు పోస్ట్ చేశాను. దర్శకుడు శరత్ గారికి ఆ ఫోటోలు నచ్చి 'రామారావు ఆన్ డ్యూటీ' గురించి చెప్పారు. అలా ఈ సినిమాలోకి వచ్చాను."

మాస్ రాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో వస్తున్నాడు రామారావు.

Tags:    
Advertisement

Similar News