Raayan | ధనుష్ సినిమాకు రిలీజ్ డేట్ ఇదే

Dhanush Raayan Movie - స్వీయ దర్శకత్వంలో రాయన్ అనే సినిమా చేస్తున్నాడు ధనుష్. ఈ మూవీ పాటల ప్రచారం మొదలైంది.

Advertisement
Update: 2024-05-11 08:26 GMT

నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ హీరోగా నటిస్తున్న 50వ చిత్రం రాయన్. ఇందులో నటించడమే కాకుండా, స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు ధనుష్. సందీప్ కిషన్ మరో లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

'తల వంచి ఎరగడే..' ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేయడం ద్వారా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎఆర్ రెహమాన్ మాస్ నంబర్‌ను కంపోజ్ చేశారు, పాటని గ్రాండ్‌గా చిత్రీకరించారు.

ధనుష్ ఒక కార్నివాల్‌లో చాలా మంది గ్రామస్తులతో కలిసి మాస్ డ్యాన్స్‌లు చేస్తూ కనిపించాడు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్ లిరిక్స్‌ రాయగా.. హేమచంద్ర, శరత్ సంతోష్ పవర్ ఫుల్ గా పాడిన ఈ పాటకు ప్రభుదేవా అద్భుతమైన కొరియోగ్రఫీ అందించాడు.

భారీ నిర్మాణ విలువలతో వస్తున్న ఈ సినిమాలో ఎస్‌జె సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, ధుషార విజయన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఓం ప్రకాష్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా రాయన్‌ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనుంది.

Tags:    
Advertisement

Similar News