18 ఓటీటీలపై కేంద్రం వేటు!

బ్లాక్ చేసిన ఓటీటీలు నగ్నత్వాన్ని, లైంగిక చర్యల్ని ప్రదర్శించడంతో బాటు, స్త్రీలని అవమానపరిచే విధంగా చిత్రీకరించే కంటెంట్‌ ని హోస్ట్ చేస్తున్నట్టు కనుగొన్నామని తెలిపింది.

Advertisement
Update:2024-03-15 09:13 IST

కేంద్ర ప్రభుత్వం 18 ఓటీటీలపై వేటు వేసింది. అశ్లీల కంటెంట్ ని స్ట్రీమింగ్ చేస్తున్న కారణంగా వీటిని నిరోధించింది. ఈ చర్య ఫలితంగా దేశంలో 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లు (గూగుల్ ప్లే స్టోర్‌లో ఏడు, ఆపిల్ యాప్ స్టోర్‌లో మూడు), ఇంకా 57 అనుబంధ సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ అయిపోయాయి. వీటితో పాటు 18 ఓవర్-ది-టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫారమ్ లు అశ్లీల కంటెంట్‌ని వ్యాప్తి చేస్తున్న కారణంగా నిరోధించినట్టు సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ (ఐ అండ్ బీ) పేర్కొంది. సృజనాత్మక వ్యక్తీకరణ ముసుగులో అశ్లీలాన్ని ప్రోత్సహించడం జరగదని పునరుద్ఘాటించిన తర్వాత ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వ సంబంధిత మంత్రిత్వ శాఖలు, మీడియా, స్త్రీ హక్కులు, బాలల హక్కుల డొమైన్ నిపుణులతో సంప్రదింపుల తర్వాత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం - 2000లోని నిబంధనల ప్రకారం అమలు చేసినట్టు పేర్కొంది.

బ్లాక్ చేసిన ఓటీటీలు నగ్నత్వాన్ని, లైంగిక చర్యల్ని ప్రదర్శించడంతో బాటు, స్త్రీలని అవమానపరిచే విధంగా చిత్రీకరించే కంటెంట్‌ ని హోస్ట్ చేస్తున్నట్టు కనుగొన్నామని తెలిపింది. విడుదల చేసిన ఓటీటీల జాబితాలో డ్రీమ్స్ ఫిలిమ్స్, వూవీ, ఎస్స్మా, అన్ కట్ అడ్డా, ట్రై ఫ్లిక్స్ X ప్రైమ్, నియాన్ X వీఐపీ, బేషరమ్స్, హంటర్స్, రాబిట్, ఎక్స్ ట్రా మూడ్, న్యూఫ్లిక్స్, మూడ్ఎక్స్, మోజ్ ఫ్లిక్స్, హాట్ షాట్స్, వీఐపీ ఫ్యూగి, చికూఫ్లిక్స్, ప్రైమ్ ప్లే వున్నాయి.

ఇటువంటి కంటెంట్ ఐటీ చట్టంలోని సెక్షన్ 67, 67 ఏ, ఐపీసీలోని సెక్షన్ 292, స్త్రీల అసభ్య ప్రాతినిధ్య (నిషేధం) చట్టం -1986 లోని సెక్షన్ 4, ఉపాధ్యాయ-విద్యార్థి సంబంధాలు, వివాహేతర కుటుంబ సంబంధాలు వంటి అంశాలను కలిగి వుంది.

ఐ అండ్ బీ శాఖ ప్రెస్ నోట్ ప్రకారం, ఈ ఓటీటీల్లో ఒక ఓటీటీ యాప్‌ కోటికి పైగా డౌన్‌లోడ్‌లను కలిగి వుండగా, మరో రెండు గూగుల్ ప్లే స్టోర్ లో 50 లక్షలకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి వున్నాయి. ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ ల వంటి ప్లాట్‌ఫారమ్‌లలో 32 లక్షల మంది యూజర్ల ఫాలోవర్‌షిప్‌తో, ఈ ప్లాట్‌ఫారమ్‌లు ప్రచారం కోసం సోషల్ మీడియాని విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి.

ఐ అండ్ బీ మంత్రిత్వ శాఖ సమావేశాలు, వెబినార్లు, వర్క్ షాప్‌లతో సహా వివిధ సెన్సిటైజేషన్ ప్రయత్నాల ద్వారా, ఐటీ రూల్స్ - 2021 ప్రకారం స్థాపించిన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లతో, వాటి స్వయం నియంత్రణా సంస్థలతో చురుకుగా కలిసి పని చేస్తోంది. కొన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఓటీటీ పరిశ్రమ పురోభివృద్ధికి తోడ్పాటు నందించడానికి ప్రభుత్వం కట్టుబడి వుంది.

54వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల వెబ్ సిరీస్ కోసం ప్రారంభ ఓటీటీ అవార్డుని ప్రవేశపెట్టడం, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల సహకారం వంటి కార్యక్రమాలు, ఐటీ రూల్స్ -2021 ప్రకారం స్వయం నియంత్రణని నొక్కి చెప్పే లైట్-టచ్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేయడం మొదలైనవి ఈ నిబద్ధతని నొక్కి చెబుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News