బింబిసార.. తేనె పలుకులు వీడియో సాంగ్ ఇదే

కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమా బింబిసార. ఈ సినిమా నుంచి మరో సాంగ్ వచ్చింది. ఈసారి రొమాంటిక్ నంబర్.

Advertisement
Update:2022-07-24 11:48 IST

''ఓ తేనె పలుకుల అమ్మాయి.. నీ తీగ నడుములో సన్నాయి లాగిందే'' అని అందమైన రాజకుమారి పాత్రలో ఉన్న క్యాథరిన్ ను చూసి రాజు పాత్రలోని నందమూరి కళ్యాణ్ రామ్ కొంటెగా పాడుతుంటే.. దానికి బదులుగా ఆమె ''ఓ కోర మీసపు అబ్బాయి నీ ఓర చూపుల లల్లాయి.. బాగుందోయ్'' అంటూ అతనిలో చిలిపిదనాన్ని మరింతగా రెచ్చగొడుతుంది.

మరి వీరిద్దరూ మధ్య ప్రేమ ఏంటి? ఎలాంటిదో తెలుసుకోవాలంటే 'బింబిసార‌' సినిమా చూడాల్సిందేనని అంటున్నారు మేకర్స్.

బింబిసార చిత్రంలో కళ్యాణ్ రామ్ మగధ సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా కనిపిస్తున్నారు. ఆయ‌న పాత్ర‌లోని వాడి, వేడిని ట్రయిలర్ లోనే చూపించారు. ఇప్పుడా పాత్రలోని రొమాంటిక్ యాంగిల్ ను ఈ సాంగ్ లో చూపించారు. వ‌రికుప్ప‌ల యాద‌గిరి ఈ పాట‌ను రాయ‌టంతో పాటు పాట‌కు అద్భుత‌మైన ట్యూన్‌ను కంపోజ్ చేశారు. హైమంత్ మ‌హ్మ‌ద్‌, స‌త్య యామిని ఈ పాట‌ను పాడారు.

కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ వస్తున్న కళ్యాణ్ రామ్, ఈసారి కూడా అదే పంథాలో చేస్తున్న సినిమా 'బింబిసార'. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై స్వయంగా కల్యాణ్ రామ్ నిర్మిస్తూ, నటిస్తున్న ఈ సినిమా ఓ టైమ్ ట్రావెల్ మూవీ అనే విషయం తెలిసిందే. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఆగస్ట్ 5న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతోంది.

ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్‌ డైరక్టర్. ప్ర‌ముఖ సీనియ‌ర్‌ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి, ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. 


Full View


Tags:    
Advertisement

Similar News