బనారస్ మూవీ ట్రయిలర్ రివ్యూ

కన్నడ చిత్రసీమ నుంచి మరో పాన్ ఇండియా మూవీ రెడీ అయింది. దాని పేరు బనారస్. ఈసారి ప్రత్యేకత ఏంటంటే.. ఇదొక టైమ్ ట్రావెల్ మూవీ.

Advertisement
Update:2022-09-27 18:14 IST

కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్ హీరోగా మారాడు. అతడు హీరోగా పరిచయమౌతున్న సినిమా బనారస్. కన్నడ సినిమా బెల్ బాటమ్ తో పేరు తెచ్చుకున్న జయతీర్థ, ఈ సినిమాకు దర్శకుడు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది.

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న బనారస్ మూవీ, నవంబర్ 4వ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగళూరులో గ్రాండ్ గా జరిగింది. కన్నడ స్టార్ రవిచంద్రన్, బాలీవుడ్ స్టార్ అర్బాజ్ ఖాన్ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

''నా పేరు సిద్ధు. నేనొక ఆస్ట్రోనాట్. ఐయామ్ ఎ టైమ్ ట్రావెలర్ అండ్ ఐ హేవ్ కమ్ ఫ్రమ్ ది ఫ్యూచర్'' అని హీరో జైద్ ఖాన్ వాయిస్ తో మొదలైన ట్రైలర్, ఆద్యంతం ఆకట్టుకుంది. లీడ్ పెయిర్ మధ్య ప్రేమ సన్నివేశాల్ని కలర్ ఫుల్ గా షూట్ చేశారు. హీరోయిన్ కి హీరో ''నేను నీ ఫ్యూచర్ భర్తని" అని చెప్పడం ఆసక్తికరంగా ఉంది.

ట్రైలర్ సెకండ్ హాఫ్ లో టైం ట్రావెల్ ఎలిమెంట్ ని పరిచయం చేసి, సినిమాపై క్యూరియాసిటీని రెట్టింపు చేశారు. ఆ సీన్స్ అన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. జైద్ ఖాన్ స్క్రీన్ ప్రజన్స్ బాగుంది. ట్రైలర్ లో చూపించిన తొలితొలి వలపే పాట రొమాంటిక్ గా ఆకట్టుకుంది. అజనీష్ లోక్‌నాథ్ నేపధ్య సంగీతం ట్రయిలర్ ను ఎలివేట్ చేసింది.


Full View


Tags:    
Advertisement

Similar News