#NBK109 - బాలకృష్ణ నెక్ట్స్ సినిమా ఎవరితో?

Balakrishna - అనీల్ రావిపూడి సినిమా తర్వాత బాలకృష్ణ నెక్ట్స్ మూవీ ఎవరితో?

Advertisement
Update:2023-05-08 15:58 IST
#NBK109 - బాలకృష్ణ నెక్ట్స్ సినిమా ఎవరితో?
  • whatsapp icon

ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. కెరీర్ లో బాలకృష్ణకు ఇది 108వ సినిమా. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దసరా రిలీజ్ కు శరవేగంగా సిద్ధమౌతోంది. ఓ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంటుండగానే మరో సినిమా ను ప్రకటించడం బాలయ్యకు అలవాటు.

అయితే ఈసారి మాత్రం కాస్త లేట్ అవుతోంది. ఎందుకో, ఇప్పటివరకు బాలకృష్ణ తన కొత్త సినిమాను ప్రకటించలేదు. బాలయ్య 109వ సినిమాకు దర్శకుడు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రేసులో బోయపాటి శ్రీను, పూరి జగన్నాధ్ ఉన్నారు.

తాజా సమాచారం ప్రకారం.. బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే బాలయ్య తన కొత్త సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు చాలామంది. దీనికి సంబంధించి ఇద్దరిమధ్య ఓ లైన్ కూడా చర్చకొచ్చిందట. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని పవర్ ఫుల్ పొలిటికల్ సబ్జెక్టుతో ఈ సినిమా చేయాలని బాలయ్య భావిస్తున్నాడు.

త్వరలోనే ఈ ప్రాజెక్టుపై ఓ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం బోయపాటి శ్రీని, రామ్ పోతినేని హీరోగా సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పనులు పూర్తయిన వెంటనే బాలయ్య-బోయపాటి కాంబోపై ఓ స్పష్టత వస్తుంది.

Tags:    
Advertisement

Similar News