Ayesha Takia | ట్రోలింగ్ దెబ్బకి ఖాతా క్లోజ్
Ayesha Takia - చిన్న వయసులోనే స్టార్ డమ్ చూసిన ఆయేషా టకియా ప్రస్తుతం కుటుంబ జీవితానికి పరిమితమైంది. అయినప్పటికీ ఆమెపై ట్రోలింగ్ నడుస్తోంది
నటి అయేషా టకియా వయసు 30 ఏళ్లు దాటింది. రెండు దశాబ్దాల కిందటే ఆమె పాపులర్ స్టార్ అయిపోయింది. అయితే కెరీర్ ను ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయింది. తన నటనతో పాటు.. అద్భుతమైన అందంతో అందర్నీ ఆకర్షించింది ఈ బ్యూటీ.
ఇక 2005లో నాగార్జున సరసన సూపర్ అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఇది అనుష్క మొదటి సినిమా కూడా. తాజాగా ఆయేషా టకియా ఇనస్టాగ్రామ్ లో ఓ ఫొటో పెట్టింది. ఇందులో ఆమె గుర్తుపట్టలేనంతగా ఉంది. ఆమె ముఖం పూర్తిగా మారిపోయింది. బుగ్గలు కనిపించలేదు. హెయిర్ స్టయిల్ కూడా మారిపోయింది.
దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అదే టైమ్ లో ఆ మెపై భారీ ట్రోలింగ్ కూడా ప్రారంభమైంది. ఒక దశలో ఆ ట్రోలింగ్ శృతిమించింది కూడా. కొంతమంది నెటిజన్లు బాడీ షేమింగ్ వరకు వెళ్లారు. దీంతో ఆయేషా తన ఇనస్టాగ్రామ్ ఖాతాను ఉన్నఫలంగా డిలీట్ చేసింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయేషా ఇనస్టాగ్రామ్ ఖాతా కనిపించడం లేదు. నిజానికి ఇలాంటి ట్రోలింగ్ ఆయేషాకు కొత్త కాదు. గతంలో కూడా ఆమె పెదవులు, శరీరాకృతిపై కామెంట్స్ పడ్డాయి. అయితే ఈసారి అది మరింత శృతిమించడంతో ఆయేషా తట్టుకోలేకపోయింది. ఇనస్టాగ్రామ్ నుంచి బయటకొచ్చేసింది.