నటుడు మోహన్ బాబుకు మరో ఎదురుదెబ్బ

తెలంగాణ హైకోర్టులో నటుడు మోహన్ బాబు బిగ్ షాక్ తగిలింది.

Advertisement
Update:2024-12-19 16:19 IST

తెలంగాణ హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు ఎదురుదెబ్బ తగిలింది. జర్నలిస్ట్‌పై దాడి కేసులో ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిసింది. ఈ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం డిసెంబర్ 23కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. మోహన్ బాబుపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఎక్కడ ఆలస్యం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే నోటీస్ ఇచ్చామని.. ఈ నెల 24వ తేదీ వరకు సమయం అడిగారని తెలిపారు. 24వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టు కూడా మోహన్ బాబుకు మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. నోటీసులకు స్పందించకపోతే అరెస్ట్ చేస్తామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News