డ్రగ్స్ కేసులో నటి హేమకు ఊరట

టాలీవుడ్ నటి హేమకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది

Advertisement
Update:2025-01-02 15:35 IST

బుల్లితెర నటి హేమకు ఊరట లభించింది. బెంగళూరు ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నదని, ఆమె డ్రగ్స్ తీసుకుందని ఆమెపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె రిమాండ్ కు కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలో, ఈ కేసులో తదుపరి చర్యలపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. రేవ్ పార్టీలో హేమ ఎండీఎంఏ తీసుకున్నారని నిరూపించే ఆధారాలు లేవని జస్టిస్ హేమంత్ చందన గౌడర్ అన్నారు. కానీ నటి హేమ మాత్రం తాను ఎలాంటి మత్తు మందు పదార్థాలు తీసుకోలేదని పలుమార్లు మీడియా ముందుకు వచ్చి వేడుకుంది. అయితే గురువారం నటి హేమ కేసుని బెంగళూరు కోర్టు పరిశీలించింది.

ఇందులో నటి హేమ తరుపు న్యాయవాది తన క్లైంట్ రేవ్ పార్టీలో ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని కోర్టుకు తెలిపాడు. అలాగే ఇప్పటివరకూ డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలలో కూడా నెగిటివ్ వచ్చిందని కాబట్టి ఆమెపై నమోదు చేసిన కేసు, ఛార్జ్ షీట్ కొట్టివేయాలని వాదించాడు. దీంతో కోర్టు నటి హేమకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇందులోభాగంగా తదుపరి విచారణ వాయిదా వరకూ నటి హేమపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు జరీ చేసింది. అలాగే ప్రభుత్వ తరుపు న్యాయవాది విచారణకి ముందస్తు నోటీసులు ఇవ్వాలని సూచించారు. దీంతో డ్రగ్స్ వ్యవహారంలో హేమకు కొంతమేర ఊరట లభించిందని చెప్పవచ్చు

Tags:    
Advertisement

Similar News