AAY trailer | పిఠాపురంలో ఆయ్ ట్రయిలర్ లాంఛ్

AAY Movie - బన్నీ వాస్ నిర్మించిన సినిమా ఆయ్. ఈ సినిమా ట్రయిలర్ లాంఛ్ ను పిఠాపురంలో పెట్టుకున్నారు. అది పవన్ నియోజకవర్గం.

Advertisement
Update:2024-08-03 21:57 IST

కుటుంబమంతా కలిసి నవ్వుకునే కంటెంట్ తో తెరకెక్కింది ఆయ్ సినిమా. నార్నే నితిన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్ తెరకెక్కింది. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరియమౌతున్నాడు. ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.

ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఆయ్’ సినిమాను స్వాతంత్య్ర దినోత్స‌వ కానుకగా ఆగ‌స్ట్ 15న విడుదల చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా వాయిదా పడుతుందని అంతా అనుకున్నారు. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ లాంటి సినిమాలు బరిలో నిలవడంతో ఆయ్ రాదనుకున్నారు.

కానీ బన్నీ వాసు మాత్రం చెప్పిన తేదీకే రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయ్ ట్రయిలర్ రిలీజ్ కు ఏర్పాట్లు చేశారు. పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురంలో ఆయ్ ట్రయిలర్ లాంచ్ నిర్వహించబోతున్నారు.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లో హీరో నార్నే నితిన్‌, హీరోయిన్ న‌య‌న్ సారిక గోదావ‌రిలో చెరో ప‌డ‌వ‌లో సేద తీరుతూ ప్ర‌కృతిని ఆస్వాదిస్తున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకు రామ్ మిర్యాల సంగీత దర్శకుడు.




Tags:    
Advertisement

Similar News