తగ్గుతున్న స్మార్ట్ ఫోన్ సేల్స్.. ఆ సెగ్మెంట్‌పై పట్టు సాధనే లక్ష్యం అంటున్న షియోమీ..!
రూ.10,000-15,000 వేల సెగ్మెంట్ ఫోన్ల మార్కెట్లో తన స్థానాన్ని సంపాదించాలని తలపోస్తున్నదని షియోమీ ఇండియా ప్రెసిడెంట్ బీ మురళీకృష్ణన్ చెప్పారు. భారతీయులు అత్యధికంగా ప్రేమించే, నమ్మకమైన స్మార్ట్‌ఫోన్లపై దృష్టి సారించామన్నారు.
షియోమీ.. పేరొందిన స్మార్ట్‌ఫోన్ల కంపెనీ.. దాదాపు దశాబ్ద క్రితం బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ.. షియోమీ ఫోన్లంటే ఫుల్ గిరాకీ.. ఇంతకుముందులా రూ.10,000-15,000 వేల సెగ్మెంట్ ఫోన్ల మార్కెట్లో తన స్థానాన్ని సంపాదించాలని తలపోస్తున్నదని షియోమీ ఇండియా ప్రెసిడెంట్ బీ మురళీకృష్ణన్ చెప్పారు. భారతీయులు అత్యధికంగా ప్రేమించే, నమ్మకమైన స్మార్ట్‌ఫోన్లపై దృష్టి సారించామన్నారు. పునాదితోపాటు సుస్థిరత, సమర్ధతపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు మురళీకృష్ణన్. 5జీ సెగ్మెంట్ ఫోన్లను అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రాధాన్యం ఇస్తోంది షియోమీ.
`ఈ రోజు 5జీ స్మార్ట్ ఫోన్ల ధర రూ.20 వేలపై మాటే. రూ.15,000-రూ.20,000 సెగ్మెంట్ ఫోన్ల సేల్స్ విస్తరిస్తున్నాయి. కానీ సామాన్యులు రూ.10,000-15,000 శ్రేణి వైపే మొగ్గుచూపుతున్నారు. 4జీలో సాధించిన సేల్స్ విజయంతో 5జీలో మ్యాజిక్ క్రియేట్ చేయాలని భావిస్తోంది` అని మురళీకృష్ణన్ తెలిపారు.
మొబైల్స్ ఫోన్ల సేల్స్ అధ్యయన సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం 2022 మార్చి త్రైమాసికంతో పోలిస్తే రూ.10,000-రూ.20,000 మధ్య ధర గల స్మార్ట్ ఫోన్ సేల్స్ 34 శాతం పడిపోయింది. రూ.45 వేల విలువ గల ప్రీమియం ఫోన్ల ధరల సేల్స్ 66 శాతానికి పెరిగింది. గత మార్చి త్రైమాసికం స్మార్ట్ ఫోన్ల సేల్స్‌లో ప్రీమియం ఫోన్ల సేల్స్ అత్యంత వృద్ధి.
`ప్రస్తుతం తమ కంపెనీ రూ.15,000-రూ.30,000 శ్రేణి ధర గల స్మార్ట్ ఫోన్లు విక్రయిస్తోంది. రూ.10,000-రూ.15,000 శ్రేణి ధర గల స్మార్ట్‌ఫోన్లను సామాన్యులకు అందుబాటులోకి తెస్తాం అని నమ్మకంతో ఉన్నాం` అని మురళీకృష్ణన్ తెలిపారు. `బడ్జెట్ సెగ్మెంట్‌లోకి ఎంటర్ కావడానికి రెడ్‌మీ నోట్ 10టీ 5జీ, రెడ్‌మీ నోట్ 11టీ 5జీ, రెడ్‌మీ11 ప్రైమ్5జీ ఫోన్లు నమ్మకం కలిగిస్తున్నాయి. అత్యంత నాణ్యతతో, నిజాయితీ ధరకే అందుబాటులోకి తెస్తామన్నారు.
గత నాలుగు త్రైమాసికాలుగా షియోమీ ఫోన్ల సేల్స్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గతేడాది మార్చి త్రైమాసికంలో షియోమీ వాటా 44 శాతం, 2023 మార్చి త్రైమాసికంలో 16 శాతానికి పడిపోయిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. తమ స్మార్ట్ ఫోన్ల సేల్స్ పెంచుకోవడానికి ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లను వృద్ధి చేస్తున్నట్లు తెలిపారు మురళీకృష్ణన్. ఈ ఏడాది చివరి కల్లా రిటైల్ స్టోర్లను 4,000 నుంచి 8,000 స్టోర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.