Hydrogen Bus Test Drive | పర్యావరణ పరిరక్షణ.. హరిత హిత హైడ్రోజన్ బస్సుతో నితిన్ గడ్కరీ చక్కర్లు
Hydrogen Bus Test Drive | పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే భూతాపం నివారించగలం.. మానవ మనుగడకు ఉజ్వల భవిష్యత్ నిర్మించగలం.. ప్రపంచ దేశాలన్నీ ఆ దిశగా వడివడిగా అడుగులేస్తున్న వేళ.. అధికారిక పర్యటన నిమిత్తం కేంద్ర రవాణ శాఖ మంత్రి జెక్ రిపబ్లిక్‌లో పర్యటించారు.
Hydrogen Bus Test Drive | పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే భూతాపం నివారించగలం.. మానవ మనుగడకు ఉజ్వల భవిష్యత్ నిర్మించగలం.. ప్రపంచ దేశాలన్నీ ఆ దిశగా వడివడిగా అడుగులేస్తున్న వేళ.. అధికారిక పర్యటన నిమిత్తం కేంద్ర రవాణ శాఖ మంత్రి జెక్ రిపబ్లిక్‌లో పర్యటించారు. పలువురు అధికారులతో కలిసి జెక్ రాజధాని ప్రేగ్‌లో హైడ్రోజన్ బస్ టెస్ట్ డ్రైవ్‌లో పాల్గొన్నారు. ఈ టెస్ట్ డ్రైవ్ దృశ్యాలతో కూడిన వీడియోను ఎక్స్ (మాజీ ట్విట్టర్) పోస్ట్ చేశారు. స్వచ్ఛమైన హరిత హిత సమాజం కోసం.. పర్యావరణ పరిరక్షణకూ.. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి హైడ్రోజన్ బస్సులు గణనీయంగా దోహద పడతాయి అనే క్యాప్షన్ కూడా రాశారు. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ స్కోడా తయారు చేసిన హైడ్రోజన్ బస్సు టెస్ట్ డ్రైవ్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారని పేర్కొంటూ పలు ఫొటోలు `ఎక్స్‌లో షేర్ చేశారు. సుస్థిర, పర్యావరణ హిత రవాణా పరిష్కార మార్గాల అన్వేషణకు భారత్ కట్టుబడి ఉందని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు అని పోస్ట్‌లో పేర్కొన్నారు.
ప్రజా రవాణా వ్యవస్థలో మరింత సుస్థిర పర్యావరణ హిత పరిష్కార మార్గం హైడ్రోజన్ బస్. బస్సుల్లో ఏర్పాటు చేసే హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్‌లోని హైడ్రోజన్‌ను, ఎయిర్‌ను కలగలిపి మండిస్తే విద్యుత్ (ఇంధనం) ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్ (పవర్) తోనే ఈ హైడ్రోజన్ బస్సు నడుస్తుంది. అంతకుముందు వరల్డ్ రోడ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. `స్టాక్ హోం డిక్లరేషన్‌కు కట్టుబడి అంతర్జాతీయ రోడ్ సేఫ్టీ లక్ష్యాలను చేరుకోవడానికి భారత్ కట్టుబడి ఉంది అని పునరుద్ఘాటించారు.
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సుదీర్ఘ కాలంగా హరిత హిత ఇంధనం, సంప్రదాయేతర ఇంధన వనరుల దిశగా పరివర్తన సాధించాలని ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది మార్చి ప్రారంభంలో దేశంలోనే తొలిసారి తయారు చేసిన గ్రీన్ హైడ్రోజన్ పవర్డ్ కారు డ్రైవ్ చేసుకుంటూ పార్లమెంట్‌కు చేరుకున్నారు. తద్వారా తాను హరిత హిత ఇంధన వాడకాన్ని ప్రోత్సహిస్తానంటూ సంకేతాలిచ్చారు.
దేశంలో తొలిసారి టయోటా కిర్లోస్కర్ తయారు చేసిన హైడ్రోజన్ ఆధారిత అత్యాధునిక ఫ్యుయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ (Fuel Cell Electric Vehicle-FCEV).. `టయోటా మిరాయి`ని గత మార్చిలో ఆవిష్కరించారు. ఆ కారుకు హరిత హిత హైడ్రోజన్ ద్వారా పవర్ (ఇంధనం) ఎలా ఉత్పత్తి అవుతుందో తెలిపే వీడియోనూ అప్పట్లో సోషల్ మీడియాలో షేర్ చేశారు. హరిత హిత ఇంధనం హైడ్రోజన్ ఇంధన రంగంలో భారత్ స్వావలంభన సాధించడానికి శక్తిమంతమైన, పర్యావరణ హిత సుస్థిర ఇంధన మార్గం ఆవిష్కరిస్తుంది అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
అంతకుముందు జనవరిలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. తాను హైడ్రోజన్ పవర్డ్ కారును మాత్రమే ఉపయోగిస్తానని ప్రకటించారు. హరిత హిత హైడ్రోజన్‌తో నడిచే కారును జపాన్ ఆటోమొబైల్ కంపెనీ టయోటా నాకు ఇచ్చింది. (ప్రత్యామ్నాయ ఇంధనంగా) దీన్ని పైలట్ ప్రాజెక్టుగా నేను ఈ కారు నడుపుతాను అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పెట్రోల్ వినియోగ కార్ల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు కావాలి. అందుకే రెండేండ్లలోనే తక్కువ ఖర్చుతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిశగా గ్రీన్ ఫ్యుయల్ టెక్నాలజీ శరవేగంగా అడుగులేస్తున్నదని చెబుతారు. నిరంతరం హరిత హితమైన ఇంధనం వాడకం దిశగా ప్రయాణించాలని హితవు చెబుతుంటారు గడ్కరీ.