మార్చిలో లాంఛ్ అయ్యే మొబైల్స్ ఇవే..

మార్చి నెలలో మొబైల్ లవర్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న బడ్జెట్ నథింగ్ ఫోన్ రిలీజ్ అవ్వనుంది.

Advertisement
Update:2024-02-26 16:41 IST

ఎప్పటిలాగానే వచ్చే నెలలో కూడా కొన్ని ప్రముఖ మొబైల్ బ్రాండ్స్ నుంచి లేటెస్ట్ మొబైల్స్ విడుదల కానున్నాయి. వీటిలో బడ్జెట్ మొబైల్స్‌తో పాటు కొన్ని ఫ్లాగ్‌షిప్ మోడల్స్ కూడా ఉన్నాయి.

మార్చి నెలలో మొబైల్ లవర్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న బడ్జెట్ నథింగ్ ఫోన్ రిలీజ్ అవ్వనుంది. అదే ‘నథింగ్ ఫోన్ 2ఎ’. తక్కువ ధరకి నథింగ్ బ్రాండ్‌ను ఎక్స్‌పీరియెన్స్ చేయాలనుకున్నవాళ్లు ఈ ఫోన్ పై ఓ లుక్కేయొచ్చు. నథింగ్ ఫోన్ 2ఎ.. మార్చి 5న ఇండియాలో రిలీజ్ అవ్వనుంది. ఇందులో 6.7-అంగుళాల ఓఎల్ ఈడీ డిస్‌ప్లే, డ్యుయల్-కెమెరా కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇది 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజీ వేరియంట్‌తో రానుంది. ఈ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఎస్‌వోసీ ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ప్లాట్‌ఫామ్‌పై రన్ అవుతుంది. ధర సుమారు రూ. 25,000కు దగ్గరగా ఉండొచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఏ 55

మార్చి నెలలో శాంసంగ్ నుంచి ఓ మిడ్ రేంజ్ ఫ్లాగ్‌షిప్ మొబైల్ రిలీజ్ అవ్వనుంది. అదే ‘శాంసంగ్ ఏ 55 5జీ’. ఇందులో 6.5-అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్‌లో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. వాటర్ ప్రూఫ్ ఫీచర్ ఉంటుంది. ఈ మొబైల్ శాంసంగ్ ఎగ్జినోస్ 1480 ఎస్ ఓసీ ప్రాసెసర్‌‌పై పని చేస్తుంది. ధర సుమారు రూ. 30,000 వరకూ ఉండొచ్చు.

రియల్‌మీ 12 ప్లస్

మార్చి నెలలో రియల్‌మీ నుంచి ‘రియల్‌మీ 12 ప్లస్’ ఫోన్ లాంఛ్ అవ్వనుంది. రియల్ మీ 12 ప్రో సిరీస్ లో మిడ్ రేంజ్ ఆప్షన్ కింద రియల్ మీ 12 ప్లస్ మొబైల్ రాబోతోంది. దీనికి సంబంధించిన టీజర్ రియల్ మీ ‘ఎక్స్(ట్విటర్)’ పేజీలో ఉంచింది. ఫీచర్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. టెక్ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఉంటుంది.

వివో వీ30 ప్రో

వచ్చే నెలలో వివో నుంచి వివో వీ30 ప్రో మొబైల్ లాంఛ్ కానుంది. ఇందులో కర్వ్డ్ త్రీడి డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ సెన్సర్‌‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటాయి. ఈ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ చిప్‌సెట్‌తో పని చేస్తుంది.

షావోమీ 14

మార్చి 7న ఇండియన్ మార్కెట్లో షావోమీ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు లాంఛ్ అవ్వనున్నాయి. ఇందులో 6.36-అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది . వెనుక 50 మెగాపిక్సె్ల్ సెన్సర్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News