Triumph Speed 400 | ఆ రెండు బైక్‌లతో ట్రయంఫ్ స్పీడ్400 `సై` అంటే `సై`!
Triumph Speed 400 | బజాజ్ భాగస్వామ్యంతో ట్రయంఫ్.. భారత్ మార్కెట్లో ట్రయంఫ్ స్పీడ్ 400 (Triumph Speed 400) మోటార్ సైకిల్‌ను గురువారం ఆవిష్కరించింది.
Triumph Speed 400 | బజాజ్ భాగస్వామ్యంతో ట్రయంఫ్.. భారత్ మార్కెట్లో ట్రయంఫ్ స్పీడ్ 400 (Triumph Speed 400) మోటార్ సైకిల్‌ను గురువారం ఆవిష్కరించింది. ఇటీవలే గ్లోబల్ మార్కెట్లలో ట్రయంఫ్ స్పీడ్400తోపాటు ట్రయంఫ్ స్క్రాంబ్లర్400 బైక్‌లను ట్రయంఫ్ ఆవిష్కరించింది. తొలి పదివేల బైక్‌ల ధర రూ.2.23 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. అటుపై రూ.2.33 లక్షలకు (ఎక్స్ షోరూమ్) లభిస్తుంది. ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్.. ట్రయంఫ్‌లో అత్యంత విజయవంతమైన అధునాతన క్లాసిక్ లైనప్ మోటార్ సైకిల్. స్క్రాంబ్లర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి బైక్‌గా ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్ నిలుస్తుంది.
ట్రయంఫ్ స్క్రాంబ్లర్ బైక్ తర్వాత మార్కెట్‌లో రిలీజ్ చేస్తారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హింక్లేలో ఈ రెండు మోటారు సైకిళ్లు డెవలప్ చేశారు. ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన హార్లీ డేవిడ్సన్ ఎక్స్440, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌లకు ట్రయంఫ్ స్పీడ్ 400 గట్టి పోటీ ఇస్తుంది. ఈ నెలాఖరులో ట్రయంఫ్ స్పీడ్400 కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. వచ్చే అక్టోబర్‌లో స్క్రాంబ్లర్400 అందుబాటులోకి వస్తుంది.
ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ 17-అంగుళాల వీల్స్ విత్ ఎంఆర్ఎఫ్ స్టీల్ బ్రేస్ రబ్బర్, 43 ఎంఎం బిగ్-పిస్టన్ ఫోర్క్, మోనోషాక్‌తోపాటు ఫ్రంట్‌లో 300 ఎంఎం, రేర్‌లో 230 ఎంఎం డిస్క్ బ్రేక్‌లతో వస్తున్నది. ఫిన్డ్ సిలిండర్ హెడ్, సంప్రదాయ ఎగ్జాస్ట్ హెడర్ క్లాంప్స్, అప్‌స్వెప్ట్ సైలెన్సర్ వంటి మోడ్రన్ ఫీచర్లు జత చేశారు. ఈ మోటారు సైకిల్ సింగిల్ వేరియంట్‌గా కార్నివాల్ రెడ్, కాస్పియన్ బ్లూ, ఫాంటమ్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
ట్రయంఫ్ స్పీడ్ 400 లిక్విడ్ కూల్డ్ 398సీసీ సింగిల్ సిలిండర్ మోటార్‌తో వస్తున్నది. ఈ మోటార్ గరిష్టంగా 40 బీహెచ్‌పీ విద్యుత్, 37.5 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. సిక్స్ స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కలిగి ఉంటది. ఎలక్ట్రానిక్ సూట్‌లో వైర్ థ్రోటెల్, స్విచ్ఛబుల్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యుయల్ చానెల్ ఏబీఎస్, టార్చ్ అసిస్ట్ క్లచ్, డ్యుయల్ ఫార్మాట్ ఇన్‌స్ట్రుమెంట్స్, యాంటీ థెఫ్ట్ ఇమ్మోబిలైజర్, కంప్లీట్‌లీ ఎల్ఈడీ లైటింగ్ ఫీచర్లు ఉంటాయి. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో గేర్ ఇండికేటర్, ఎల్‌సీడీ స్క్రీన్ డిస్‌ప్లే, ఫ్యూయల్ రేంజ్ ఉంటాయి.
రెండేండ్ల వరకు అపరిమితమైన మైలేజీ వారంటీ లభిస్తుంది. మహారాష్ట్రలోని బజాజ్ ఆటో ఉత్పాదక యూనిట్‌లో బజాజ్-ట్రయంఫ్ స్పీడ్400 బైక్ తయారు చేస్తున్నారు. ట్రయంఫ్ మోటారు సైకిళ్లకు 16 వేల కి.మీ.లకోసారి సర్వీసింగ్ తప్పనిసరి చేశారు.