Toyota MPV Rumion | మారుతి ఎర్టిగా నుంచి.. ట‌యోటా ఎంవీపీ ఆల్‌న్యూ రిమియాన్‌.. వ‌చ్చేనెల లాంచింగ్‌.. ఇవీ డిటైల్స్‌!

Toyota MPV Rumion | గ‌తంతో పోలిస్తే ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. కుటుంబ స‌భ్యులంతా ప్ర‌యాణించ‌డానికి సౌక‌ర్యవంతంగా ఉండే ఎస్‌యూవీలు, మ‌ల్టీ ప‌ర్ప‌స్ వెహిక‌ల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.

Advertisement
Update:2023-08-18 13:42 IST

Toyota MPV Rumion | గ‌తంతో పోలిస్తే ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. కుటుంబ స‌భ్యులంతా ప్ర‌యాణించ‌డానికి సౌక‌ర్యవంతంగా ఉండే ఎస్‌యూవీలు, మ‌ల్టీ ప‌ర్ప‌స్ వెహిక‌ల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలో దేశంలోని ప్ర‌ముఖ కార్ల త‌యారీసంస్థ టయోటా కిర్లోస్క‌ర్ మోటార్స్ (టీకేఎం) త‌న మ‌ల్టీప‌ర్ప‌స్ వెహిక‌ల్ (ఎంపీవీ) సెగ్మెంట్‌ను విస్త‌రించ‌డాల‌ని త‌ల‌పెట్టింది. ఆల్ న్యూ కంపాక్ట్ ఎంవీపీ కారు టయోటా రుమియాన్ (Rumion) ను ఆవిష్క‌రిస్తామ‌ని తెలిపింది. నియో డ్రైవ్ (ఐఎస్‌జీ) టెక్నాల‌జీతో కే సిరీస్ 1.5 లీట‌ర్ల పెట్రోల్ ఇంజిన్‌, ఈ-సీఎన్జీ వేరియంట్‌లోనూ ఆవిష్క‌రిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. వ‌చ్చే నెల భార‌త్ మార్కెట్‌లో అడుగు పెట్టనున్న ట‌యోటా రిమియాన్ (Rumion) సీఎన్జీ వేరియంట్ కిలో సీఎన్జీపై 26.11 కి.మీ మైలేజీ, పెట్రోల్ వేరియంట్ లీట‌ర్ పెట్రోల్‌పై 20.51 కి.మీ మైలేజీ ఇవ్వ‌నున్న‌ది.

ఆల్ న్యూ ట‌యోటా రుమియాన్ ఆరు వేరియంట్లు ఎస్ (మాన్యువ‌ల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్‌), జీ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌, వీ (మాన్యువ‌ల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్‌), ఎస్ మాన్యువ‌ల్ ట్రాన్‌మిష‌న్ సీఎన్జీ వ‌ర్ష‌న్ల‌లో అందుబాటులోకి రానున్న‌ది. విస్తృత శ్రేణి ఆప్ష‌న్లు క‌స్ట‌మ‌ర్ల‌కు ల‌భిస్తాయి.



న్యూ కంపాక్ట్ ఎంవీపీ రుమియాన్ (Rumion) కారులో క‌స్ట‌మ‌ర్లు 5-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ లేదా స్మూత్‌గా సాగే 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్‌ల్లో ఏదో ఒక ఆప్ష‌న్ ఎంచుకోవ‌చ్చున‌ని తెలిపింది.

ఆల్‌న్యూ ట‌యోటా రుమియాన్ అడ్వాన్స్‌డ్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్ట‌మ్‌తో వ‌స్తుంది. అందులో 17.78 సెం.మీ స్మార్ట్ ప్లే కాస్ట్ ట‌చ్‌స్క్రీన్ ఆడియో విత్ ఆర్క్య‌మాఏస్ స‌రౌండ్ సెన్స్ ఫ‌ర్ ఇమ్మ‌ర్సివ్ ఆడియో ఎక్స్‌పీరియ‌న్స్‌.. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే (వైర్‌లెస్‌)కు స‌పోర్ట్‌గా ఉంటుంది.

హియ‌ర్‌టెక్ ప్లాట్‌ఫామ్‌, డ్యుయ‌ల్ ఫ్రంట్ అండ్ ఫ్రంట్ సీట్ సైడ్ ఎయిర్‌బ్యాగ్స్‌, ఏబీఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ అసిస్ట్‌, ఇంజిన్ ఇమ్మొబిలైజ‌ర్‌, ఈఎస్పీ, హిల్ హోల్డ్ అసిస్ట్‌, ఐఎస్ఓ ఫిక్స్ చైల్డ్ సీట్ యాంక‌రేజీ ఫ‌ర్ సేఫ్టీ ఫీచ‌ర్లు ఉంటాయి. కారులో ప్ర‌యాణించే కుటుంబ స‌భ్యులంద‌రికి మ‌న‌శ్శాంతి హామీ ఇచ్చేలా.. ఫ్రంట్ సీట్ బెల్ట్స్‌, ప్రీ టెన్ష‌న‌ర్స్‌, ఫోర్స్ లిమిట‌ర్స్‌, అన్ని సీట్ల‌కు సీట్‌బెల్ట్ రిమైండ‌ర్, హై స్పీడ్ అల‌ర్ట్ సిస్ట‌మ్ వంటి సేఫ్టీ ఫీచ‌ర్లు జ‌త చేశారు.

ట‌యోటా ఎంవీపీ సిగ్నేచ‌ర్ ఫ్రంట్ గ్రిల్లె, ఫ్రంట్ బంపర్ విత్ క్రోమ్ ఫినిష్‌, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ విత్ బ్యాక్ డోర్ క్రోమ్ గార్నిష్, మెషిన్డ్ టూ టోన్ అల్లాయ్ వీల్స్‌, హైట్ అడ్జ‌స్ట‌బుల్ డ్రైవ‌ర్ సీట్‌, స్ప్లిట్ ఫోల్డ్ సెకండ్ అండ్ థ‌ర్డ్ రో సీట్స్‌, ప్ల‌స్ డ్యుయ‌ల్ టోన్ సీట్ ఫ్యాబ్రిక్ విత్ ఫ్లెక్సిబుల్ ల‌గేజ్ స్పేస్ విత్ ఫ్లాట్ ఫోల్డ్ ఫంక్ష‌నాలిటీ ఆప్ష‌న్లు ఉంటాయి. ఆల్ న్యూ ట‌యోటా రుమియాన్ ల‌క్ష కి.మీ లేదా మూడేండ్ల వ‌ర‌కు స్టాండ‌ర్డ్‌, ఐదేండ్లు లేదా 2.20 ల‌క్ష‌ల కి.మీ. వ‌రకూ వారంటీ పొడిగింపు ఉంటుంద‌ని భావిస్తున్నారు.



మారుతి సుజుకి ఎర్టిగా ఎంవీపీ నుంచి టెక్నాల‌జీని ట‌యోటా కిర్లోస్క‌ర్ పొంద‌నున్న‌ది. రెండు కార్ల త‌యారీ సంస్థ‌ల మధ్య టెక్నాల‌జీ మార్పిడి ఒప్పందం ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా (ఎంవీపీ) మోడ‌ల్ రూ.8.64 ల‌క్ష‌లు (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతుంది. త్వ‌ర‌లో మార్కెట్లోకి వ‌చ్చే రుమియాన్ రూ.8.80-10.70 ల‌క్ష‌ల మధ్య ధ‌ర ఉండొచ్చున‌ని అంచ‌నా వేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News