నేడు (25-12-2022) స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి
ఆదివారం ఉదయం వరకు బులియన్ మార్కెట్‌లో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధర రూ.150 నుంచి రూ.160 వరకూ పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,850కి చేరింది.
దేశంలో బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అంచనా వేయడం చాలా కష్టం. క్షణాల వ్యవధిలోనే రేట్లలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక మొన్నటి వరకు పరుగులు పెట్టి.. పసిడి ప్రియులకు షాకిచ్చింది. అయితే నిన్న మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలోనే బంగారం ధర పతనమైంది. ఈ క్రమంలో ఇక బంగారం ధర క్రమంగా దిగొస్తుందని చాలా మంది భావించారు. కానీ, వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ పసిడి రేటు మళ్లీ పెరిగింది. ఇక వెండి ధర కూడా భారీగా పెరిగింది.
ఆదివారం ఉదయం వరకు బులియన్ మార్కెట్‌లో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధర రూ.150 నుంచి రూ.160 వరకూ పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,850కి చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.54,380కు ఎగబాకింది. ఇక దేశీయంగా కిలో వెండి ధర నిన్న 70,100 ఉన్న విషయం తెలిసిందే. అయితే నేటి ఉదయానికి వెండి ధర రూ.1000 పెరగడంతో.. ప్రస్తుతం దాని రేటు రూ.71,100కు చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేస్తే..
22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..
హైదరాబాద్‌లో రూ.49,850.. రూ.54,380
విజయవాడలో రూ.49,850.. రూ.54,380
విశాఖపట్నంలో రూ.49,850 .. రూ.54,380
చెన్నైలో రూ.50,790.. రూ.55,400
కోల్‌కతాలో రూ.49,850.. రూ.54,380
బెంగళూరులో రూ.49,900.. రూ.54,410
కేరళలో రూ.49,850.. రూ.54,490
ఢిల్లీలో రూ.50,000.. రూ.54,380
ముంబైలో రూ.49,850.. రూ.54,380
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,000
విజయవాడలో రూ.74,000
విశాఖపట్నంలో రూ.74,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.74,000
బెంగళూరులో రూ.74,000
కేరళలో రూ.74,000
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,000
ముంబైలో కిలో వెండి ధర రూ.71,000