నేడు (13-12-2022) స్వల్పంగా తగ్గిన బంగారం ధర

మంగళవారం బంగారం పది గ్రాములపై రూ.110 వరకు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధరపై (10 గ్రాములు) రూ.100 మేర తగ్గి 49,800కు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 తగ్గి రూ.54,330కి చేరుకుంది.

Advertisement
Update:2022-12-13 08:37 IST

సాధారణంగానే మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం. పైగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనక తప్పని పరిస్థితి. ఈ క్రమంలో కాస్త ధ‌ర‌ తగ్గితే బాగుండు అని అనుకోని వారు ఎవరుంటారు? అయితే నేడు అందరూ కోరుకున్నట్టుగానే బంగారం ధర అత్యంత స్వల్పంగా తగ్గింది. ఇంత స్వల్ప తగ్గుదలను పరిగణలోకి తీసుకోకున్నా కూడా నిన్న బంగారం ధర స్థిరంగా ఉండటం.. నేడు అంతో ఇంతో తగ్గడం ఊరట కలిగిస్తోంది. అయితే ఇటీవల కాలంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతుండటంతో పెట్టుబడిగా కూడా కొనుగోలు చేసేవారున్నారు. వెండిధర కూడా స్వల్పంగా తగ్గింది. మంగళవారం బంగారం పది గ్రాములపై రూ.110 వరకు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధరపై (10 గ్రాములు) రూ.100 మేర తగ్గి 49,800కు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 తగ్గి రూ.54,330కి చేరుకుంది. అలాగే వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. వెండి ధర కిలోపై రూ.900 వరకూ తగ్గింది. ఇక దేశంలో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ. 49,800.. రూ. 54,330

విజయవాడలో రూ. 49,800.. రూ. 54,330

విశాఖపట్నంలో రూ. 49,800.. రూ. 54,330

చెన్నైలో రూ. 50,450.. రూ. 55,040

బెంగళూరులో రూ. 49,850.. రూ. 54,390

కేరళలో రూ. 49,800.. రూ. 54,330

కోల్‌కతాలో రూ. 49,800.. రూ. 54,330

న్యూఢిల్లీలో రూ. 49,950.. రూ. 54,490

ముంబైలో రూ. 49,800.. రూ. 54,330

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ. 72,800

విజయవాడలో రూ. 72,800

విశాఖపట్నంలో రూ. 72,800

చెన్నైలో రూ. 72,800

కేరళలో రూ. 72,800

బెంగుళూరులో రూ. 72,800

కోల్‌కతాలో రూ. 69,000

ఢిల్లీలో రూ. 69,000

ముంబైలో రూ. 69,000

Tags:    
Advertisement

Similar News