Tata Nexon.ev Vs Mahindra XUV400 | టాటా నెక్సాన్.ఈవీ ..మ‌హీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీల్లో ఏది బెస్ట్‌..

Tata Nexon.ev Vs Mahindra XUV400 | ఇంట‌ర్న‌ల్ కంబుస్ట‌న్ ఇంజిన్ (ఐసీఈ)తో దేశీయ కార్ల త‌యారీ సంస్థ టాటా మోటార్స్‌.. మార్కెట్లోకి త‌న పాపుల‌ర్ స‌బ్‌-4మీట‌ర్స్ ఎల‌క్ట్రిక్‌ ఎస్‌యూవీ కారు టాటా నెక్సాన్ 2023 ఆవిష్క‌రించింది.

Advertisement
Update:2023-09-16 12:11 IST

Tata Nexon.ev Vs Mahindra XUV400 | టాటా నెక్సాన్.ఈవీ ..మ‌హీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీల్లో ఏది బెస్ట్‌..

Tata Nexon.ev Vs Mahindra XUV400 | ఇంట‌ర్న‌ల్ కంబుస్ట‌న్ ఇంజిన్ (ఐసీఈ)తో దేశీయ కార్ల త‌యారీ సంస్థ టాటా మోటార్స్‌.. మార్కెట్లోకి త‌న పాపుల‌ర్ స‌బ్‌-4మీట‌ర్స్ ఎల‌క్ట్రిక్‌ ఎస్‌యూవీ కారు టాటా నెక్సాన్ 2023 ఆవిష్క‌రించింది. టాటా నెక్సాన్.ఈవీ 2023 ధర రూ.14.74 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) నుంచి మొద‌ల‌వుతుంది. టాప్ హై ఎండ్ వేరియంట్ ధ‌ర రూ.19.94 ల‌క్ష‌లు (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతుంది. ఈ ప్రారంభ ధ‌ర‌లు లిమిటెడ్ పీరియ‌డ్ మాత్ర‌మే అమ‌ల్లో ఉంటాయి. ఇదిలా ఉంటే మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా ఎల‌క్ట్రిక్ స‌బ్‌-4 మీట‌ర్స్ ఎస్‌యూవీ.. మ‌హీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీతో నేరుగా త‌ల ప‌డుతోంది. మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈవీ కారు ధ‌ర రూ.15.99 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) నుంచి రూ.19.39 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతోంది. ఈ నేప‌థ్యంలో టాటా నెక్సాన్‌.ఈవీ, మ‌హీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ కారుల్లో ఏది బెస్ట్ అన్న‌ది ఒక‌సారి చూద్దామా..!

టాటా నెక్సాన్.ఈవీ ఇంజిన్ వేరియంట్లు ఇలా

టాటా నెక్సాన్.ఈవీ 2023 కారు మిడ్ రేంజ్ (ఎంఆర్‌), లాంగ్ రేంజ్ (ఎల్ఆర్‌) వేరియంట్ల‌లో ల‌భిస్తుంది. ఎంఆర్ వేరియంట్ 30 కిలోవాట్ల బ్యాట‌రీ ప్యాక్ విత్ జెన్‌-2 ప‌ర్మ‌నెంట్ మాగ్నైట్ సింక్రోనస్ మోటార్‌తో వ‌స్తున్న‌ది. ఈ మోటార్ 129 హెచ్పీ విద్యుత్‌, 215 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. సింగిల్ చార్జింగ్‌తో 325 కి.మీ దూరం ప్ర‌యాణిస్తుంది. 7.2 కిలోవాట్ల ఏసీ చార్జ‌ర్ (స్టాండ‌ర్డ్‌) సాయంతో 10 శాతం నుంచి 100 శాతం చార్జింగ్ కావ‌డానికి 4.3 గంట‌లు ప‌డుతుంది.

నెక్సాన్‌.ఈవీ లాంగ్ రేంజ్ 40.5 కిలోవాట్ల బ్యాట‌రీ ప్యాక్ విత్ జెన్‌-2 ప‌ర్మ‌నెంట్ మాగ్నెట్ సింక్రోన‌స్ మోటార్ క‌లిగి ఉంటుంది. ఈ మోటారు గరిష్టంగా 145 హెచ్‌పీ విద్యుత్‌, 215 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది. సింగిల్ చార్జింగ్‌తో 465 కి.మీ దూరం వ‌ర‌కూ ప్ర‌యాణం చేయొచ్చు. 7.2 కిలోవాట్ల ఏసీ చార్జ‌ర్ (స్టాండ‌ర్డ్‌)తో 10-100 శాతం చార్జింగ్ కావ‌డానికి ఆరు గంట‌లు ప‌డుతుంది. డీసీ ఫాస్ట్ చార్జ‌ర్ సాయంతో ఎంఆర్‌, ఎల్ ఆర్ బ్యాట‌రీల చార్జింగ్‌కు 56 నిమిషాలు మాత్రమే ప‌డుతుంది.

మ‌హీంద్రా ఎక్స్‌యూవీ400లో మోటార్ల కెపాసిటీ ఇలా

మ‌హీంద్రా ఎక్స్‌యూవీ ఎలక్ట్రిక్ కారు ఈసీ, ఈఎల్ వేరియంట్ల‌లో ల‌భిస్తుంది. ఈసీ వేరియంట్ 34.5 కిలోవాట్ల బ్యాట‌రీ ప్యాక్‌, ఈఎల్ వేరియంట్ 39.4 కిలోవాట్ల బ్యాట‌రీ ప్యాక్ క‌లిగి ఉంటాయి. ఈసీ, ఈఎల్ వేరియంట్ కార్లు ఫ్రంట్ యాక్సిల్ మౌంటెడ్ ఎల‌క్ట్రిక్ మోటార్‌తో వ‌స్తున్నాయి. గ‌రిష్టంగా 150 హెచ్పీ విద్యుత్‌, 310 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తాయి. మూడు డ్రైవింగ్ మోడ్స్- ఫ‌న్‌, ఫాస్ట్‌, ఫియ‌ర్‌లెస్ మోడ్‌ల‌లో మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈవీ కారు వ‌స్తున్న‌ది.

34.5 కిలోవాట్ల బ్యాట‌రీ ప్యాక‌ప్ గ‌ల మ‌హీంద్రా ఎక్స్‌యూవీ400 కారు సింగిల్ చార్జింగ్‌తో 375 కి.మీ దూరం, 39.4 కిలోవాట్ల బ్యాట‌రీ ప్యాక‌ప్ వేరియంట్ 456 కి.మీ దూరం ప్ర‌యాణిస్తాయి. 50కిలోవాట్ల డీసీ ఫాస్ట్ చార్జ‌ర్ సాయంతో 0-80 శాతం కేవ‌లం 50 నిమిషాల్లో చార్జింగ్ అవుతుంది.

నెక్సాన్‌.ఈవీ ఫీచ‌ర్లు ఇలా

టాటా నెక్సాన్‌.ఈవీ కారు 12.3 అంగుళాల ట‌చ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్మెంట్ విత్ యూఐ, డిజిట‌ల్ ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌, టూ స్పోక్ ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్‌, సింగిల్ పాన్‌ స‌న్‌రూఫ్‌, ట‌చ్ బేస్డ్ హెచ్‌వాక్ కంట్రోల్స్ విత్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌, 10.25 అంగుళాల డిజిట‌ల్ ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్‌, ఎయిర్ ఫ్యూరిఫ‌య్య‌ర్‌, ఫాస్ట్ చార్జింగ్ టైప్‌-సీ పోర్ట్స్‌, 360 -డిగ్రీ కెమెరా వీ2వీ (వెహిక‌ల్ టు వెహిక‌ల్‌), వీ2ఎల్ (వెహిక‌ల్ టూ లోడ్‌0 ఫీచ‌ర్లు ఉన్నాయి.

ఇలా మ‌హీంద్రా ఎక్స్‌యూవీ400 ఫీచ‌ర్లు

మ‌హీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ కారు 7.0-అంగుళాల ట‌చ్‌స్క్రీన్ విత్ మ‌హీంద్రా అడ్రెనోక్స్ సాఫ్ట్ వేర్‌, సింగిల్ పాన్ స‌న్‌రూఫ్‌, క‌నెక్టెడ్ కార్ టెక్నాల‌జీ విత్ ఓవ‌ర్ ది ఎయిర్ (ఓటీఏ) అప్‌డేట్స్‌, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్‌, సెమీ డిజిట‌ల్ క్ల‌స్ట‌ర్‌, ప్రొజెక్ట‌ర్ హెడ్ ల్యాంప్స్ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్‌, డిస్క్ బ్రేక్స్ ఆన్ ఫోర్ వీల్స్‌, బ్యాట‌రీ ప్యాక్‌, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ యాంక‌రేజెస్ త‌దిత‌ర ఫీచ‌ర్లు సేఫ్టీ కిట్‌పై ఐపీ67 రేటింగ్ వ‌స్తుంది.

నెక్సాన్.ఈవీ సేఫ్టీ ఫీచ‌ర్లు ఇలా

టాటా నెక్సాన్‌.ఈవీ కారు సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్‌, ఏబీఎస్‌, ఈఎస్‌సీ, టీసీఎస్‌, ఫ్రంట్ పార్కింగ్ సెన్స‌ర్లు, బ్లైండ్ వ్యూ మానిట‌ర్‌, త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్ ఫ‌ర్ ఆల్ సీట్స్‌, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ మౌంట్స్‌, హిల్ డిసెంట్‌, యాక్సెంట్ కంట్రోల్‌, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్‌, పానిక్ బ్రేక్ అల‌ర్ట్‌, ఎమ‌ర్జెన్సీ అండ్ బ్రేక్‌డౌన్ కాల్ అసిస్ట్ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News