బంపర్ ఆఫర్.. ఆ కార్లపై.. రూ. లక్షా 20వేల డిస్కాంట్

నెక్సాన్‌ ఈవీపై లక్షా 20వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ మోడల్‌ ధర రూ.14.49 లక్షలు నుంచి స్టార్చ్ కానుంది. టియాగో ఈవీపై రూ.70 వేల డిస్కౌంట్‌ ప్రకటించింది.

Advertisement
Update:2024-02-13 23:47 IST

ఎలక్ట్రిక్‌ కార్లు కొనాలనుకునే వారికి ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. నెక్సాన్‌ ఈవీపై లక్షా 20వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ మోడల్‌ ధర రూ.14.49 లక్షలు నుంచి స్టార్చ్ కానుంది. టియాగో ఈవీపై రూ.70 వేల డిస్కౌంట్‌ ప్రకటించింది. ఇకపై ఈ మోడల్‌ ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. బ్యాటరీ వ్యయం తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా యాజమాన్యం తెలిపింది. ఇటీవలే రిలీజ్ చేసిన పంచ్‌ ఈవీ ధరను మాత్రం స్థిరంగా ఉంచారు.

ఎలక్ట్రానిక్‌ వాహనాల్లో బ్యాటరీకయ్యే ఖర్చే ఎక్కువ. కానీ ఇటీవల కాలంలో బ్యాటరీ ధరలు బాగా తగ్గాయి. భవిష్యత్‌లో మరింత తగ్గుతాయని అంచనా. తగ్గిన బ్యాటరీల ధరను కస్టమర్లకు డిస్కౌంట్ల రూపంలో ఇస్తున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ వెహికల్స్‌కు ఈమధ్య ఆదరణ బాగా పెరిగింది. అందుకే ఈవీలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని ధరలు తగ్గించినట్లు టాటా కంపెనీ తెలిపింది.

ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ అమ్మకాలు చాలా బాగున్నాయని టాటా మోటార్స్‌ తెలిపింది. 2023లో ప్రయాణ వాహనాల అమ్మకాల్లో 8 శాతం వృద్ధి నమోదవగా.. ఈవీ సెగ్మెంట్‌లో 90 శాతం వృద్ధి నమోదైంది. 2024 జనవరిలో ఈవీ విక్రయాల్లో 100 శాతం అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం ఈవీ సెగ్మెంట్‌లో టాటా మోటార్స్‌ 70 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో ఉంది.

Tags:    
Advertisement

Similar News