Tata Motors: ఈ ఏడాది కార్ల సేల్స్ అంతంతే.. ఆ నిబంధనే కారణమా.. కానీ టాటా మోటార్స్ ఏమంటున్నది..?

Tata Motors | ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో కార్ల విక్ర‌యాలు అంతంత మాత్ర‌మేన‌ని ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ టాటా మోటార్స్ తేల్చేసింది.

Advertisement
Update:2023-06-06 13:46 IST

Tata Motors l ఈ ఏడాది కార్ల సేల్స్ అంతంతే.. ఆ నిబంధనే కారణమా.. కానీ టాటా మోటార్స్ ఏమంటున్నది..?!

Tata Motors | ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో కార్ల విక్ర‌యాలు అంతంత మాత్ర‌మేన‌ని ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ టాటా మోటార్స్ తేల్చేసింది. 2022-23లో మొత్తం కార్ల సేల్స్‌లో టాటా మోటార్స్‌ 54 శాతం వృద్ధిరేటు సాధించింది. గ‌త ఏడాదిలో దేశం అంతా కార్ల సేల్స్‌లో 27 శాతం వృద్ధి న‌మోదైనా.. కానీ ఈ ఏడాది మోస్తరుగా 5-7 శాతం ఉంటుంద‌న్నారు టాటా మోటార్స్ ప్యాసింజ‌ర్ వెహిక‌ల్స్ అండ్ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ ఎండీ శైలేష్ చంద్ర చెప్పారు. దీనికి కార్ల రేట్లు భారీగా పెర‌గ‌డ‌మే కార‌ణం.

క‌ర్బ‌న ఉద్గారాల నియంత్ర‌ణ‌కు ఈ ఏడాది ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి రెండో ద‌శ బీఎస్‌-6 ప్ర‌మాణాలు అమ‌ల్లోకి తెచ్చింది. అందులో భాగంగా కార్ల ఇంజిన్ల‌లో నిత్యం కాలుష్యాన్ని అంచ‌నా వేసే `రియ‌ల్ డ్రైవింగ్ ఎమిష‌న్ (ఆర్డీఈ)` ప‌రిక‌రం అమ‌ర్చాల‌ని కార్ల త‌యారీ సంస్థ‌ల‌కు కేంద్రం తేల్చి చెప్పింది. కానీ ఆర్డీఈ ఏర్పాటు చేయ‌డం కాస్ట్‌లీ వ్య‌వ‌హారం. ఫ‌లితంగా అన్ని కార్ల సంస్థ‌లు ధ‌ర‌లు పెంచేశాయి. దీని ప్ర‌భావం కార్ల విక్ర‌యాల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని శైలేశ్ చంద్ర తేల్చి చెప్పారు. అయినా వ‌చ్చే ఏడాది కార్ల విక్ర‌యంలో డ‌బుల్ డిజిట్ గ్రోత్ న‌మోద‌వుతుంద‌ని భావిస్తున్న‌ట్లు తెలిపారు.

`ఆర్డీఈ` నిబంధ‌న అమ‌లుతో కార్ల ధ‌ర‌లు పెర‌గ‌డంతో త‌గ్గ‌నున్నడిమాండ్ పెంచ‌డానికి టాటా మోటార్స్ ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక రూపొందించింది. ఇప్ప‌టికే ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ కార్ల విక్ర‌యంలో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న‌ది. తాజాగా సీఎన్జీ, ఎల‌క్ట్రిక్ కార్లను మార్కెట్లోకి ఆవిష్క‌రించ‌డంపైనే దృష్టి పెట్టింది.

`ఎల‌క్ట్రిక్ కార్ల విక్ర‌యం పెంచాల‌ని భావిస్తున్నాం. సీఎన్జీ సెగ్మెంట్‌లో మా పోర్ట్‌ఫోలియో విస్త‌రించాల‌ని త‌ల‌పెట్టాం. మా కార్ల విక్ర‌యాల‌తోపాటు మార్కెట్ వాటా గ‌ణ‌నీయంగా పెంచుకోవాలి. ఇప్ప‌టికే మార్కెట్‌లో ఉన్న బ్రాండ్ల‌లో మార్పుల‌తోపాటు కొత్త మోడ‌ల్ కార్లు తేవ‌డానికి కృషి చేస్తున్నాం` అని శైలేష్ చంద్ర వెల్ల‌డించారు. కొత్త‌గా క‌ర్వ్‌, సియారా వంటి మోడ‌ల్ కార్లు మార్కెట్లోకి తీసుకొస్తామ‌న్నారు.

ఈ నెల ప్రారంభంలోనే టాటా మోటార్స్ త‌న సీఎన్జీ వ‌ర్ష‌న్ కార్ల ఆవిష్క‌ర‌ణ ప్రారంభించింది. హ్యాచ్ బ్యాక్ ప్రీమియం ఆల్ట్రోజ్ ను సీఎన్జీ వ‌ర్ష‌న్‌లో మార్కెట్లో విడుద‌ల చేసింది. సీఎన్జీ వేరియంట్ ఆల్ట్రోజ్ కారు ధ‌ర రూ.7.55 ల‌క్ష‌ల నుంచి ప్రారంభమ‌వుతుంది. తాజాగా పాపుల‌ర్ మోడ‌ల్ టాటా పంచ్ సీఎన్జీ వేరియంట్ కారును ఆవిష్క‌రించేందుకు సిద్ధ‌మైంది. ట్విన్ సిలిండ‌ర్ టెక్నాలజీతో మార్కెట్లోకి వ‌స్తున్న‌ది. దీంతోపాటు ఈవీ కార్ల‌ను మార్కెట్లో ఆవిష్క‌రించ‌డం ద్వారా త‌న మార్కెట్ వాటా పెంచ‌గ‌ల సామ‌ర్థ్యం ఈ రెండు మోడ‌ల్ కార్ల‌కు ఉంద‌ని టాటా మోటార్స్ భావిస్తున్న‌ది. సీఎన్జీ, ఈవీ సెగ్మెంట్ల‌లోనే ఈ ఏడాది గ్రోత్ ఉంటుంద‌ని విశ్వ‌సిస్తున్న‌ది.

Tags:    
Advertisement

Similar News