Tata Altroz Racer | స్పోర్టీ లుక్‌తో టాటా ఆల్ట్రోజ్ రేసర్.. రూ.9.49 లక్షల నుంచి షురూ..!
Tata Altroz Racer | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లలో ఒకటైన టాటా ఆల్ట్రోజ్ రేసర్ (Tata Altroz Racer)ను స్పోర్టీ లుక్‌తో దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Tata Altroz Racer | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లలో ఒకటైన టాటా ఆల్ట్రోజ్ రేసర్ (Tata Altroz Racer)ను స్పోర్టీ లుక్‌తో దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆవిష్కరించింది. దీని ధర రూ.9.49 లక్షల నుంచి రూ.10.99 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య నడుస్తుంది. టాటా ఆల్ట్రోజ్ ((Tata Altroz) టర్బో పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే, న్యూ టాటా ఆల్ట్రోజ్ రేసర్ కారు స్పోర్టీ లుక్ కలిగి ఉంటుంది. ఆసక్తి గల కస్టమర్లు రూ.21 వేల టోకెన్ సొమ్ము చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇంకా టాటా మోటార్స్ తన స్టాండర్డ్ ఆల్ట్రోజ్‌లో సెలెక్టెడ్ వేరియంట్లను అప్ డేట్ చేసింది. హ్యుండాయ్ ఐ10 ఎన్ లైన్ కారుతో టాటా ఆల్ట్రోజ్ రేసర్ పోటీ పడుతుంది. హ్యుండాయ్ ఐ20 ఎన్ లైన్ కారు ధర రూ.10 లక్షల నుంచి రూ.12.52 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది.
టాటా నెక్సాన్ (Tata Nexon)లో వాడిన 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను టాటా ఆల్ట్రోజ్ రేసర్ (Tata Altroz Racer) కారులో వినియోగించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 118 బీహెచ్పీ విద్యుత్, 170 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ లో మాత్రమే లభిస్తుందీ టాటా ఆల్ట్రోజ్ రేసర్ (Tata Altroz Racer). స్టాండర్డ్ టాటా ఆల్ట్రోజ్ కారుతో పోలిస్తే ఆల్ట్రోజ్ రేసర్ కారు మరింత స్పోర్టీ లుక్ తో వస్తుందని టాటా మోటార్స్ తెలిపింది.
టాటా ఆల్ట్రోజ్ రేసర్ (Tata Altroz Racer)క కారులో డ్యుయల్ టోన్ పెయింట్ స్కీంతోకూడిన బ్లాక్డ్ ఔట్ బాయ్‌నెట్, రూఫ్ తదితర అప్ డేట్స్ జత చేశారు. రూఫ్ అండ్ బూట్ మీద బాయ్ నెట్ పొడవునా ట్విన్ వైట్ స్ట్రైప్స్, ఫెండర్ మీద రేసర్ బ్యాడ్జి, స్పోర్టీ ట్రీట్‌మెంట్‌తో న్యూ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. టాటా ఆల్ట్రోజ్ రేసర్ ((Tata Altroz Racer) కారు మూడు డ్యుయల్ టోన్ కలర్ ఆప్షన్లు - ఆటోమిక్ ఆరంజ్, ఎవెన్యూ వైట్, ప్యూర్ గ్రే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
టాటా ఆల్ట్రోజ్ రేసర్ (Tata Altroz Racer) కారులో ఆరెంజ్ హైలేట్స్‌తోపాటు బ్లాక్డ్ ఔట్ అపియరెన్స్‌తో కూడిన క్యాబిన్ ఉంటుంది. ట్విన్ స్ట్రైప్స్, కాంట్రాస్ట్ స్టిచింగ్‌తోపాటు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా తదితర ఫీచర్లు జత చేశారు.