జొమాటో బాటలోనే స్విగ్గీ

జొమాటో తన ప్లాట్‌ ఫామ్‌ ధరల్ని పెంచినట్లు తెలుపగానే స్విగ్గీ నుంచి అదే వచ్చిన అదే ప్రకటన

Advertisement
Update:2024-10-24 14:19 IST

జొమాటో బాటలోనే ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ పయనిస్తున్నది. స్విగ్గీ కూడా ప్లాట్‌ ఫామ్‌ ధరలు పెంచింది. ఇకపై ప్రతి ఆర్డర్‌పైనా రూ. 10 చొప్పున వసూలు చేయనున్నది. ఇంతకుముందు ఈ ప్లాట్‌ఫామ్‌ ఫీజుగా రూ. 7 వసూలు చేసేది. జొమాటో తన ప్లాట్‌ ఫామ్‌ ధరల్ని పెంచిన తర్వాత స్విగ్గీ నుంచి ఈ ప్రకటన రావడం విశేషం.

పెంచిన ప్లాట్‌ ఫామ్‌ ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చినట్లు స్విగ్గీ యాప్‌ చూస్తే స్పష్టమౌతుంది. యాప్‌ ఓపెన్‌ చేయగానే ఆర్డర్‌పై ప్లాట్‌ ఫామ్‌ ఫీజు హైదరాబాద్‌లో రూ. 10గా చూపెడుతున్నది. ఇక జొమాటో సైతం తన ప్లాట్‌ ఫామ్‌ ఫీజును రూ. 10కి పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే మొదట ఇవన్నీ రూమర్లేనని వార్తలు రావడంతో కంపెనీ ఈ విషయంపై తాజాగా స్పందించింది. ప్లాట్‌ఫామ్‌ ఫీజు పెంపు వాస్తవమేనని వెల్లడించింది. పండుగల సీజన్‌లో సర్వీస్‌లు అందించడానికి ప్లాట్‌ఫామ్‌ ధరలు పెంచాం. మా బిల్లులు చెల్లించడానికి ఇవి సాయపడుతాయని కంపెనీ తన యాప్‌ ద్వారా తెలిపింది. నగరాల వారీగా ఈ పెంపులో వ్యత్యాసం ఉంటుందని జొమాటో తెలియజేసింది. అయితే ఏ నగరాల్లో పెంచిందనే విషయంపై స్పష్టత లేదు. అయితే ఇరు సంస్థలు ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా అనేకసార్లు ఈ ధరల్ని పెంచుతూ వస్తున్నాయి.

జొమాటో ఆగస్ట్ 2023లో ప్లాట్‌ఫామ్‌ ధరల్ని ప్రవేశపెట్టింది, ఒక్కో ఆర్డర్‌కు రూ. 2 వసూలు చేసింది. జనవరి 2024 నాటికి ఈ ఫీజును ఒక్కో ఆర్డర్‌కు రూ. 4కి పెంచింది. ప్రస్తుతం, ఇది ఒక ఆర్డర్‌కు రూ. 10 రుసుము వసూలు చేస్తుంది. ప్లాట్‌ఫామ్ రుసుము వినియోగదారులందరికీ, గోల్డ్ సభ్యులకు కూడా వర్తిస్తుంది. అయితే ఈ ప్లాట్‌ ఫామ్‌ ధరల పెంపుపై ఫుడ్‌ లవర్స్‌ అసంతృత్తి వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News