లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 81,745 వద్ద, నిఫ్టీ 25,049 వద్ద ట్రేడవుతున్నాయి.

Advertisement
Update:2024-10-09 10:25 IST

దేశీయ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ఒత్తిళ్ల నుంచి తేరుకున్న సూచీలు లాభాల బాట పట్టాయి. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 165 పాయింట్ల లాభంతో 81,745 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 25,049 వద్ద ట్రేడవుతున్నాయి. అలాగే నేడు ఆర్బీఐ పరపతి విధాన నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.

సెన్సెక్స్‌ 30 టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, మారుతీ సుజుకీ, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, నెస్లే ఇండియా, కోటక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. నేడు ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్ల (FIIs) మంగళవారం నికరంగా రూ. 5,750 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా.. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ. 7,001 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు పెరిగి 83.92గా కొనసాగుతున్నది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 77.42 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,635.50 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. 

Tags:    
Advertisement

Similar News