భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ఇటీవల భారీ నష్టాలతో కనిష్టాల వద్ద ఉన్న మార్కెట్లలో కొనుగోళ్లకు మొగ్గు చూపిన మదుపర్లు
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 10.39 గంటల సమయానికి సెన్సెక్స్ 855 పాయింట్ల లాభంతో 80,257 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలున్నప్పటికీ.. ఇటీవల భారీ నష్టాలతో కనిష్టాల వద్ద ఉన్న మార్కెట్లలో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. నిఫ్టీ 235 పాయింట్ల లాభంతో 24,426 వద్ద ట్రేడుతున్నది. చాలారోజులుగా దిద్దుబాటుకు లోనవుతున్న షేర్ల ధరలు నేడు పాజిటివ్‌గా కనిపించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.08 వద్ద ప్రారంభమైంది.
నిఫ్టీలో ఐసీఐసీఐ బ్యాంక్, భారత్ పెట్రోలియం, ఎస్‌బీఐ, ఎన్టీపీసీ, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు రాణిస్తుండగా.. కోల్ ఇండియా, ఎఎన్జీసీ, ఐషర్ మోటర్స్, లార్సెన్, ఐటీసీ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. సానుకూల త్రైమాసిక ఫలితాలతో నేడు ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ల 2 శాతానికి పైగా లాభాల్లో ఉన్నాయి. యెస్ బ్యాంక్ షేర్లు 9 శాతం మేర పెరిగాయి.