కొత్తగా వచ్చిన స్టాక్ మార్కెట్ స్కామ్! జాగ్రత్త పడండిలా..
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రకం స్కామ్‌ల ద్వారా జనాన్ని మోసం చేస్తుంటారు. ఇందులో భాగంగానే రీసెంట్‌గా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనే కొత్త కాన్సెప్ట్ మొదలుపెట్టారు.
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రకం స్కామ్‌ల ద్వారా జనాన్ని మోసం చేస్తుంటారు. ఇందులో భాగంగానే రీసెంట్‌గా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనే కొత్త కాన్సెప్ట్ మొదలుపెట్టారు. ఇదెలా ఉంటుందంటే..
ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్ లాభాల బాటలో వెళ్తోంది. దీన్ని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు అమాయకులకు వల వేసే ప్రయత్నం చేస్తున్నారు. తక్కువ డబ్బుతో ఎక్కువ ప్రాఫిట్స్ అంటూ సోషల్ మీడియా, వాట్సాప్ వేదికగా ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్స్ చేస్తున్నారు. ఇలాంటి స్కామ్‌ల బారిన పడకుండాఉండాలంటే ముందుగా స్కామ్ ఎలా జరుగుతుందో తెలుసుకోవడం ముఖ్యం.
నేరగాళ్లు ముందుగా సోషల్ మీడియా లేదా వాట్సాప్ ప్రమోషనల్ మెసేజ్‌ల ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్ పేరుతో నకిలీ స్కీమ్స్ క్రియేట్ చేసి పోస్టులు పెడతారు. స్టాక్ మార్కెట్ పెరుగుతోందని, మీ ఇన్వెస్ట్‌మెంట్ మీరే చేసుకోవచ్చని, మేము గైడెన్స్ ఇస్తామని నమ్మబలుకుతారు. అలా మాయమాటలతో వాట్సప్ గ్రూపులో చేరుస్తారు. గ్రూప్‌లో చేరాక అసలు స్కామ్ మొదలవుతుంది.
వాట్సాప్ గ్రూప్‌లో చేరినవెంటనే అక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ లాభాలు పొందుతున్నట్టు రకరకాల స్క్రీన్‌షాట్ల మెసేజ్‌లు కనిపిస్తాయి. వాటిని పెట్టేవాళ్లంతా ఫేక్ యూజర్లు. అది తెలియక మిగతావాళ్లు కూడా త్వరగా ఇన్వెస్ట్ చేయాలని తొందరపడతారు. అయితే ఇన్వెస్ట్ మెంట్స్ చేసేందకు వీళ్లొక ప్రత్యేకమైన యాప్ క్రియేట్ చేస్తారు. లింక్ ద్వారా ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోమని చెప్తారు. ఆ యాప్.. గ్రో, జిరోదా, పేటియం వంటి యాప్స్‌ను పోలి ఉంటుంది. అది నిజమైన ట్రేడింగ్ యాప్ అనుకుని దానిద్వారా ఇన్వెస్ట్ చేస్తే ఇక అంతే సంగతులు. ఒకసారి యాడ్ చేసిన డబ్బు మళ్లీ తిరిగి రాదు. ఈ స్కామ్ బారిన పడి ఇటీవల పుణెకు చెందిన ఇద్దరు వ్యక్తులు సుమారు రెండు కోట్ల వరకూ నష్టపోయారు.
జాగ్రత్తలు ఇలా..
డబ్బు పేరుతో ఆశ చూపేవాళ్ల మాటల నమ్మకూడదని గుర్తుంచుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం అల్రెడీ ఒరిజినల్ యాప్స్ ఉండగా డూప్లికేట్ యాప్స్ వాడమని చెప్పేవాళ్లు మోసం చేస్తున్నట్టు గుర్తించాలి.
ఏ యాప్ అయినా ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. లింక్స్ ద్వారా డౌన్‌లోడ్ చేసే యాప్స్ నకిలీవని తెలుసుకోవాలి.
స్టా్క్ మార్కె్ట్ అనేది అందరికీ ఒకేలా వర్తిస్తుందే తప్ప యాప్స్‌ను బట్టి ప్రాఫిట్స్ పెరగడం అనేది ఉండదు. కాబట్టి ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.