Raymond-Gautam Singhania | ప‌ర్స‌న‌ల్ లైఫ్‌పై రేమండ్స్ చైర్మ‌న్ గౌతం సింఘానియా కుండ‌బ‌ద్ధ‌లు.. వ్యాపారం వ్య‌క్తిగ‌తం వేర్వేరట‌..న‌వాజ్ మోదీ ఏం చెబుతున్నారంటే..?!

Raymond-Gautam Singhania | ప్ర‌ముఖ దుస్తుల కంపెనీ రేమండ్స్ అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. రేమండ్స్ చైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ గౌతం సింఘానియా త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి, వ్యాపారానికి సంబంధం లేద‌న్నారు. తాను పూర్తిగా త‌న వ్యాపారంపైనే కేంద్రీక‌రించి, మంచి ఫ‌లితాలు సాధించ‌డంపైనే దృష్టి సారిస్తాన‌ని చెప్పారు.

Advertisement
Update:2024-05-07 12:30 IST

Raymond-Gautam Singhania | ప్ర‌ముఖ దుస్తుల కంపెనీ రేమండ్స్ అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. రేమండ్స్ చైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ గౌతం సింఘానియా త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి, వ్యాపారానికి సంబంధం లేద‌న్నారు. తాను పూర్తిగా త‌న వ్యాపారంపైనే కేంద్రీక‌రించి, మంచి ఫ‌లితాలు సాధించ‌డంపైనే దృష్టి సారిస్తాన‌ని చెప్పారు. త‌మ భార్యాభ‌ర్త‌ల ఏం జ‌రిగింద‌న్న విష‌య‌మై స్పందించ‌బోన‌ని ఓ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించారు. గౌతం సింఘానియా, న‌వాజ్ మోదీ సింఘానియా మ‌ధ్య విభేదాలు పొడ‌సూపి వేర్వేరుగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే.

2023 న‌వంబ‌ర్ 13న త‌న భార్య న‌వాజ్ మోదీ సింఘానియాతో విడిపోయి వేరుగా ఉంటున్న‌ట్లు గౌతం సింఘానియా స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అంతే కాదు. ఇటీవ‌ల రేమండ్స్ అనుబంధ మూడు కంపెనీల నుంచి న‌వాజ్ మోదీ సింఘానియాను డైరెక్ట‌ర్‌గా తొల‌గిస్తూ బోర్డు డైరెక్ట‌ర్ల స‌మావేశం తీర్మానించింది.

గ‌త మార్చి 31న జ‌రిగిన రేమండ్స్ గ్రూప్ అసాధార‌ణ వార్షిక వాటాదారుల స‌మావేశంలో జేకే ఇన్వెస్ట‌ర్స్ లిమిటెడ్ (జేకేఎల్‌), రేమండ్ క‌న్జూమ‌ర్ కేర్ (ఆర్సీసీఎల్‌), స్మార్ట్ అడ్వైజ‌రీ అండ్ ఫిన్ స‌ర్వ్ కంపెనీల డైరెక్ట‌ర్‌గా న‌వాజ్ మోదీ సింఘానియాను తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆమె ప‌ట్ల న‌మ్మ‌కం లేనందు వ‌ల్లే బోర్డు నుంచి న‌వాజ్ మోదీ సింఘానియాను తొల‌గించామ‌ని గౌతం సింఘానియా పేర్కొన్నారు.

త‌న వ్య‌క్తిగ‌త జీవితం త‌న‌కు ఉంటుంద‌ని గౌతం సింఘానియా స్ప‌ష్టం చేశారు. 1అన్ని ర‌కాల వ్యాపారాలు వృద్ధి చెందుతున్నాయి. నా వ్య‌క్తిగ‌త జీవితం నాది. దాంతో నేనే వ్య‌వ‌హ‌రించాలి. నాకు ఇద్ద‌రు అంద‌మైన అమ్మాయిలు ఉన్నారు. వారి ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలి. కానీ దీనిపై నేను స్పందించ‌ను. వ్యాపార రంగంలోని ఏ ఒక్క‌రికైనా నా వ్య‌క్తిగ‌త జీవితంతో సంబంధం లేదు` అని స్ప‌ష్టం చేశారు.

త‌మ రేమండ్ గ్రూప్ బిజినెస్ శ‌ర‌వేగంగా రూ.10 వేల కోట్ల‌కు పెరిగింది. ఇందులో లైఫ్ స్టైల్ డివిజ‌న్ అప్పారెల్‌, ఫ్యాబ్రిక్ ప్ర‌ధాన వాటా క‌లిగి ఉంటుంది. రేమండ్స్ గ్రూప్ సంస్థాగ‌త వ్య‌వ‌స్థ గురించి గౌతం సింఘానియా స్పందిస్తూ.. మేం శ‌క్తిమంత‌మైన గ‌వ‌ర్నింగ్ బాడీ క‌లిగి ఉన్నాం. సంస్థ‌లో చాలా మార్పులు తెచ్చాం. డైరెక్ట‌ర్ల బోర్డులో గ‌త 36 నెల‌ల్లో కొత్త బోర్డు స‌భ్యులు వ‌చ్చి చేరారు. ప్ర‌తి బిజినెస్‌కు ఒక సీఈఓ ప‌ని చేస్తున్నారు. ఈ బిజినెస్‌ను స్టాటిస్టిక్స్ బిజినెస్ యూనిట్లుగా విడ‌దీసి వ్యాపారం పెంచుకోవ‌చ్చు అని తెలిపారు.

ఇదిలా ఉంటే దాంప‌త్య బంధం నుంచి విడాకులు పొందేందుకు గౌతం సింఘానియాకు న‌వాజ్ మోదీ సింఘానియా ష‌ర‌తు విధించారు. సుమారు రూ.11 వేల కోట్ల రూపాయ‌ల సంప‌ద త‌న‌కు క‌ట్ట‌బెట్టాల‌ని డిమాండ్ చేశారు. తాను విడాకులు పొందేందుకు మొత్తం కంపెనీ విలువ 75 శాతం చెల్లించాల‌ని న‌వాజ్ మోదీ గుర్తు చేశారు. నవాజ్ మోదీతో విడిపోయిన‌ట్లు గౌతం సింఘానియా ప్ర‌క‌టించిన త‌ర్వాత గ‌తేడాది నవంబ‌ర్ 22న రేమండ్స్ షేర్ రూ.1,666గా న‌మోదైంది. ప్ర‌స్తుతం రేమండ్స్ షేర్ విలువ మూడు శాతం ప‌త‌నంతో రూ.2,161 ప‌లుకుతున్న‌ది.

Tags:    
Advertisement

Similar News