ఫస్ట్‌ టైమ్‌ 84 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేట్లను 50 బేస్‌ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో నిన్నటి ట్రేడింగ్‌ సెషన్‌లో రాణించిన రెండోరోజూ అదే బాటలో పయనిస్తున్నాయి.

Advertisement
Update: 2024-09-20 06:59 GMT

దేశీయ మార్కెట్లలో బుల్‌ జోరు కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల మధ్య ఉదయం లాభాలాతో ప్రారంభమైన సూచీలు అదే బాటలో ప్రయాణిస్తున్నాయి. తాజాగా కొత్త శిఖరాలను తాకాయి. సెన్సెక్స్‌ తొలిసారి 84 వేల మార్క్‌ను దాటింది. నిఫ్టీ 25,650 మార్క్‌ను తాకింది. బ్యాంక్‌ నిఫ్టీ కూడా 53,343 మార్క్‌ వద్ద తాజా గరిష్టాన్ని నమోదు చేసింది. ఆటో, మెటల్‌ స్టాక్స్‌ రాణిస్తుండగా.. ఐటీ స్టాక్స్‌ మాత్రం స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.

సెన్సెక్స్‌ ఉదయం 10:50 గంటల సమయంలో 84,053 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 25,673 వద్ద సరికొత్త రికార్డును తాకింది. అలాగే సెన్సెక్స్‌ 30లో రెండు స్టాక్స్‌ మినహా అన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News