SBI Home Loans Special Campaign | ఎస్బీఐ బంపర్ ఆఫర్.. పండుగ సీజన్‌లో అగ్గువకే ఇండ్ల రుణాలు..!
SBI Home Loans Special Campaign | సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తున్న భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) శుభవార్త అందించింది. త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మెరుగైన రుణ పరపతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది.
SBI Home Loans Special Campaign | సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తున్న భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) శుభవార్త అందించింది. త్వరలో పండుగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మెరుగైన రుణ పరపతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇంతకుముందు ప్రాసెసింగ్ ఫీజులో రాయితీ కల్పించిన ఎస్బీఐ.. తాజాగా బంపర్ ఆఫర్ అందించింది. సొంతింటి కల కనే వారి కోసం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకూ వడ్డీరేట్లలో రాయితీ అందిస్తోంది. అందరికీ గరిష్టంగా 65 బేసిక్ పాయింట్ల వడ్డీరేటు తగ్గిస్తున్నట్లు తెలిపింది. కొత్త ఇండ్ల రుణాల నుంచి ఇప్పటికే తీసుకున్న ఇండ్ల రుణాలపై టాపప్ లోన్లపైనా ఈ ఆఫర్ వర్తిస్తుంది. అతి తక్కువ నుంచి అత్యధిక సిబిల్ స్కోర్ గల వారికి మంజూరు చేసే రుణాలపై ఈ రాయితీ అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం `స్పెషల్ క్యాంపెయిన్` అనే పేరు పెట్టింది.
సిబిల్ స్కోర్ 700-749 నుంచి 151-200 పాయింట్ల మధ్య గల వారికి గరిష్టంగా వడ్డీరేట్లలో 65 బేసిక్ పాయింట్లు, అసలు సిబిల్ స్కోర్ లేని వారికి 45 బేసిక్ పాయింట్లు వడ్డీరేట్లు తగ్గిస్తున్నది. ప్రస్తుతం ఇండ్ల రుణాలపై ఎస్బీఐ 9.15 - 9.65 శాతం మధ్య వడ్డీరేట్లు వసూలు చేస్తున్నది. తాజా క్యాంపెయిన్‌లో భాగంగా వడ్డీరేట్లు 8.6 నుంచి 9.65 శాతం మధ్య ఖరారవుతాయి.
ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ రేట్ ప్రకారం ఇండ్ల రుణాలపై వడ్డీరేటు 9.15 శాతం. 750, అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వారికి గరిష్టంగా 55 బేసిక్ పాయింట్ల వడ్డీ మాఫీ చేస్తారు. అంటే 8.60 శాతానికే వడ్డీ అందిస్తుంది ఎస్బీఐ. 700-749 మధ్య క్రెడిట్ స్కోర్ నుంచి 151-200 మధ్య క్రెడిట్ స్కోర్ గల వారికి ఇండ్ల రుణాలపై 65 బేసిక్ పాయింట్లు వడ్డీరేటు తగ్గుంది. దీని ప్రకారం 9.35 నుంచి 8.70 శాతం వడ్డీపై ఇండ్ల రుణాలు లభిస్తాయి.
టేకోవర్ రుణాలు, రెడీ టు మూవ్ ప్రాపర్టీస్ కొనుగోలుకు ఇండ్ల రుణం తీసుకునే వారి సిబిల్ స్కోర్ 700 పాయింట్లు అదనంగా ఉంటే 20 బేసిక్ పాయింట్లు వడ్డీరేటులో రాయితీ ఉంటుంది. 750, అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ కల వారికి 8.40 శాతం వడ్డీకి ఇంటి రుణం లభిస్తుంది. 700-749 పాయింట్ల మధ్య సిబిల్ స్కోర్ గల వారికి 8.50 శాతం వడ్డీపై హోంలోన్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
టాపప్ రుణాలపై ఇలా
ఇప్పటికే తీసుకున్న ఇండ్ల రుణాలపై టాపప్ రుణాలు తీసుకునే వారికి ఈ `స్పెషల్ క్యాంపెయిన్`లో 45 బేసిక్ పాయింట్ల వడ్డీరేటు తగ్గింపు లభిస్తుంది. 750, అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ గల వారికి 9.10 శాతంపై వడ్డీరేటు వర్తిస్తుంది. 700-749, 151-200 పాయింట్ల మధ్య సిబిల్ స్కోర్ గల వారికి, ఎటువంటి సిబిల్ స్కోర్ గల వారికీ 45 బేసిక్ పాయింట్లు వడ్డీరేట్లు తగ్గుతుంది. అంటే 9.30 శాతం నుంచి వడ్డీరేట్ లభిస్తుంది. ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి.