Tata Safari-Harrier | దేశంలోకెల్లా సేఫెస్ట్ ఎస్‌యూవీ కార్లు ఇవే..

Tata Safari-Harrier | దేశంలోని ప్ర‌ధాన ఎస్‌యూవీ కార్ల‌లో టాటా స‌ఫారీ, టాటా హారియ‌ర్.. భార‌త్‌లోనే అత్యంత సుర‌క్షిత‌మైన కార్లు. గ్లోబ‌ల్ ఎన్‌-క్యాప్ రేటింగ్స్‌, బాడీ టైప్‌తో సంబంధం లేకుండా ఇత‌ర కార్ల కంటే అత్య‌ధిక సేఫ్టీ రేటింగ్స్ అందుకుంటున్నాయి.

Advertisement
Update:2024-05-29 18:18 IST

Tata Safari-Harrier | భార‌త్‌లో రోజురోజుకు ఎస్‌యూవీ కార్ల విక్ర‌యాలు పెరుగుతున్నాయి. మొత్తం కార్ల విక్ర‌యాల్లో ఎస్‌యూవీ కార్ల వాటా 50 శాతం పై మాటే. క‌స్ట‌మ‌ర్లు తాము కొనుగోలు చేసే ఎస్‌యూవీలు పెద్ద‌గా, బోల్డ్‌గా ఉండాల‌ని కోరుకున్నారు. ఇప్పుడు ఎస్‌యూవీ కార్లు సేఫ్‌గా ఉండాల‌ని కూడా కోరుకుంటున్నారు. ప్ర‌తి నెలా ఎస్‌యూవీల పాపులారిటీ పెరుగుతున్న వేళ.. సుర‌క్షితమైన ఎస్‌యూవీ కారు కోసం చూద్దామా..!

టాటా పంచ్ లేదా టాటా నెక్సాన్ లేదా ఫోక్స్‌వ్యాగ‌న్ టైగూన్ లేదా స్కోడా కుషాక్ లేదా మ‌హీంద్రా స్కార్పియో-ఎన్ మోడ‌ల్ కార్ల‌లో సుర‌క్షిత‌మైన ఎస్‌యూవీ కారు ఏదో తెలుసుకోవాల‌ని భావిస్తున్నారా.. గ్లోబ‌ల్ ఎన్‌-క్యాప్ రేటింగ్స్ ప్ర‌కారం ఈ ఎస్‌యూవీలు ఖ‌చ్చితంగా సుర‌క్షితమ‌ని చెప్పొచ్చు. కానీ ఈ కార్లు అంత సుర‌క్షితం కాద‌ని అంటున్నారు.

దేశంలోని ప్ర‌ధాన ఎస్‌యూవీ కార్ల‌లో టాటా స‌ఫారీ, టాటా హారియ‌ర్.. భార‌త్‌లోనే అత్యంత సుర‌క్షిత‌మైన కార్లు. గ్లోబ‌ల్ ఎన్‌-క్యాప్ రేటింగ్స్‌, బాడీ టైప్‌తో సంబంధం లేకుండా ఇత‌ర కార్ల కంటే అత్య‌ధిక సేఫ్టీ రేటింగ్స్ అందుకుంటున్నాయి. టాటా స‌ఫారీ, టాటా హారియ‌ర్ కార్లు.. ల్యాండ్ రోవ‌ర్ డీ8 ప్లాట్‌ఫామ్ ఒమెగార్క్‌ ఆర్కిటెక్చ‌ర్‌తో రూపుదిద్దుకున్నాయి. 6-ఎయిర్‌బ్యాగ్స్‌, ఎల‌క్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ) వంటి ఫీచ‌ర్లు స్టాండ‌ర్డ్‌గా ఈ రెండు కార్ల‌లో ఉంటాయి.

 

గ్లోబ‌ల్ ఎన్‌-క్యాప్ రేటింగ్స్ ప్ర‌కారం టాటా స‌ఫారీ, టాటా హారియ‌ర్ కార్లు పెద్ద‌లు, పిల్ల‌ల సంర‌క్ష‌ణ‌లో 5-స్టార్ రేటింగ్స్ అందుకున్నాయి. పెద్ద‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో 34 పాయింట్ల‌కు 33.05, పిల్ల‌ల పరిర‌క్ష‌ణ‌లో 49 పాయింట్ల‌కు 45 పాయింట్లు పొందాయి ఈ రెండు ఎస్‌యూవీలు. భార‌త్ ఎన్‌-క్యాప్ రేటింగ్స్‌లోనూ టాటా స‌ఫారీ, టాటా హారియ‌ర్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందాయి.

 

టాటా స‌ఫారీ ధ‌ర రూ.16.19 ల‌క్ష‌ల నుంచి రూ.27.34 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతుంది. ఇక టాటా హారియ‌ర్ రూ.15.49 ల‌క్ష‌ల నుంచి రూ.26.44 ల‌క్ష‌లు (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతుంది. రెండు కార్లూ క్య్రోటెక్ 2.0 లీట‌ర్ల డీజిల్ ఇంజిన్‌తో వచ్చాయి. ఈ ఇంజిన్ గ‌రిష్టంగా 170 పీఎస్ విద్యుత్‌, 350 ఎన్ఎం టార్క్ వెలువ‌రించ‌డంతోపాటు 6-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్‌, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ల‌తో వ‌స్తుంది.

Tags:    
Advertisement

Similar News