Royal Enfield Classic 350 2024: సెప్టెంబ‌ర్ 1న 2024-రాయ‌ల్ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఆవిష్క‌ర‌ణ‌.. ఐదు వేరియంట్ల‌లో రెడీ..!

Royal Enfield Classic 350 CC 2024: ప్ర‌ముఖ ద్విచ‌క్ర వాహ‌నాల త‌యారీ సంస్థ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) త‌న 2024-రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (2024 Royal Enfield Classic 350) మోటారు సైకిల్‌ను మంగ‌ళ‌వారం ఆవిష్క‌రించింది.

Advertisement
Update:2024-08-13 13:30 IST

Royal Enfield Classic 350 CC 2024: ప్ర‌ముఖ ద్విచ‌క్ర వాహ‌నాల త‌యారీ సంస్థ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) త‌న 2024-రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (2024 Royal Enfield Classic 350) మోటారు సైకిల్‌ను మంగ‌ళ‌వారం ఆవిష్క‌రించింది. వ‌చ్చేనెల ఒక‌టో తేదీన దేశీయ మార్కెట్లోకి తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అదే రోజు నుంచి బుకింగ్స్‌, టెస్ట్ రైడ్స్ ప్రారంభం అవుతాయ‌ని తెలిపింది. రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ 2024 క్లాసిక్ 350 (2024 Royal Enfield Classic 350) మోటారు సైకిల్ ఐదు వేరియంట్లు - హెరిటేజ్ (Heritage), హెరిటేజ్ ప్రీమియం (Heritage Premium), సిగ్న‌ల్స్ (Signals), డార్క్ (Dark), ఎమ‌రాల్డ్ (Emerald) వేరియంట్ల‌లో ల‌భిస్తాయి. 2024-రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోటారు సైకిల్ ఏడు రంగుల్లో ల‌భిస్తుంది.


2024-రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (2024 Royal Enfield Classic 350) హెరిటేజ్ (Heritage) వేరియంట్ రెండు క‌ల‌ర్ వేరియంట్లు- మ‌ద్రాస్ రెడ్ (Madras Red), జోధ్‌పూర్ బ్లూ (Jodhpur Blue)ల్లోనూ, హెరిటేజ్ ప్రీమియం (Heritage Premium) మెడాల్లియ‌న్ బ్రాంజ్ క‌ల‌ర్ (Medallion Bronze) ఆప్ష‌న్‌, సిగ్న‌ల్స్‌ (Signals) వేరియంట్ క‌మాండో శాండ్ (Commando Sand) క‌ల‌ర్‌లో ల‌భిస్తుంది. డార్క్ (Dark) వేరియంట్ (Gun Grey) గ‌న్ గ్రే డ్యుయ‌ల్ టోన్ స్కీమ్ ఆఫ్ గ్రే అండ్ బ్లాక్ విత్ కాప‌ర్ హైలేట్ క‌ల‌ర్‌, స్టెల్త్ బ్లాక్ (Stealth Black) క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌తో వ‌స్తోంది. టాప్ హై ఎండ్ వేరియంట్ ఎమ‌రాల్డ్ (Emerald) రీగ‌ల్ గ్రీన్ క‌ల‌ర్ విత్ క్రోమ్ అండ్ కాప‌ర్ పిన్ స్ట్రిప్‌లో వ‌స్తోంది.


2024- రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (2024 Royal Enfield Classic 350) మోటారు సైకిల్ న్యూ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్‌, ఎల్ఈడీ పైల‌ట్ ల్యాంప్‌, లెజెండ‌రీ టియ‌ర్ డ్రాప్ ట్యాంక్‌, క‌స్ట‌ర్ మీద‌ గేర్ పొజిష‌న్ ఇండికేట‌ర్‌, టైప్‌-సీ యూఎస్బీ చార్జింగ్ పాయింట్ ఉంటుంది. డార్క్‌, ఎమ‌రాల్డ్ వేరియంట్ల‌లో 2024-రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (2024 Royal Enfield Classic 350)లో స్టాండ‌ర్డ్‌గా ట్రిప్ప‌ర్ పాడ్ ఫిట్‌మెంట్ విత్ అడ్జ‌స్ట‌బుల్ లివ‌ర్ అండ్ ఎల్ఈడీ వింక‌ర్స్ ఉంటాయి. జే-ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపుదిద్దుకున్న‌జే-సిరీస్ ఇంజిన్‌తో వ‌స్తోంది. ఈ ఇంజిన్ 349సీసీ, ఎయిర్ ఆయిల్ కూల్డ్, సింగిల్ సిలిండ‌ర్‌తో వ‌స్తుండ‌టంతోపాటు గ‌రిష్టంగా 20.2 బీహెచ్‌పీ విద్యుత్‌, 27 ఎన్ఎం టార్క్ విత్ 5-స్పీడ్ గేర్ బాక్స్ ఉంటాయి.


2024- రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (2024 Royal Enfield Classic 350) మోటారు సైకిల్ ట్విన్ డౌన్ ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ విత్ 41 ఎంఎం ఫ్రంట్ టెలిస్కోపిక్ స‌స్పెన్ష‌న్‌, ట్విన్ ట్యూబ్ ఎమ‌ల్ష‌న్ షాక్స్ ఎట్ రేర్ ఉంటాయి. ఫ్రంట్‌లో 19-అంగుళాల వీల్ (అల్లాయ్/ స్పోక్‌), రేర్‌లో 18 అంగుళాల వీల్ (అల్లాయ్/ స్పోక్‌) ఉంటాయి. ఫ్రంట్‌లో 300ఎంఎం డిస్క్‌, రేర్‌లో 270 ఎంఎం డిస్క్ లేదా 153 ఎంఎం డ్ర‌మ్ బ్రేక్ ఉంటాయి. వీటితోపాటు మోటారు సైకిల్ బాత్ సింగిల్ చానెల్‌, డ్యుయ‌ల్ చానెల్ ఏబీఎస్ ఆప్ష‌న్ల‌తో వ‌స్తోంది. ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఉన్న రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 రూ.1.93 ల‌క్ష‌ల నుంచి రూ.2.25 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) వ‌ర‌కూ ప‌లుకుతుంది. తాజాగా 2024 రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోటారు సైకిల్ ధ‌ర ఎక్కువ‌గా ఉండొచ్చున‌ని భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News