Royal Enfield Bullet 350 | కొత్త‌గా రెండు క‌ల‌ర్స్‌లో ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350.. బేస్ మోడ‌ల్‌తో పోలిస్తే కాస్ట్‌లీ..!

Royal Enfield Bullet 350 | బుల్లెట్ మిలిట‌రీ, బుల్లెట్ మిలిట‌రీ సిల్వ‌ర్ (న్యూ), బుల్లెట్ స్టాండ‌ర్డ్‌, బుల్లెట్ బ్లాక్ గోల్డ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో బుల్లెట్ 350 వ‌స్తుంది. బేస్ బుల్లెట్ మిలిట‌రీ మిన‌హా అన్ని బుల్లెట్లు హ్యాండ్ పెయింటెడ్ పిన్ స్ట్రైప్స్‌తో వ‌స్తాయి.

Advertisement
Update:2024-01-26 08:37 IST

Royal Enfield Bullet 350 | ప్ర‌ముఖ ద్విచ‌క్ర వాహ‌నాల త‌యారీ సంస్థ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) త‌న బుల్లెట్ 350 మోటారు సైకిల్ ను తాజాగా రెండు కొత్త క‌ల‌ర్ ఎడిష‌న్ల‌లో మార్కెట్ల‌లో ఆవిష్క‌రించింది. మిలిట‌రీ సిల్వ‌ర్ ఎడిష‌న్‌లో వ‌చ్చిన రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటారు సైకిల్ తాజాగా మిలిట‌రీ సిల్వ‌ర్ బ్లాక్, మిలిట‌రీ సిల్వ‌ర్ రెడ్ క‌ల‌ర్స్‌లో ల‌భిస్తుంది. బేసిక్ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటారు సైకిళ్ల‌తో పోలిస్తే ఈ రెండు క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌తో వ‌చ్చే బుల్లెట్ ధ‌ర ఎక్కువ‌. ఈ మోటారు సైకిల్ ధ‌ర రూ.1.79 ల‌క్ష‌ల నుంచి ప్రారంభం అవుతుంది. జావా 350, హోండా హెచ్ఎన్ఈఎస్ఎస్ సీబీ350 మోటారు సైకిళ్ల‌తో రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ పోటీ ప‌డుతుంది.


విశ్వ‌జ‌నీన డిజైన్ కావ‌డంతో మిలిట‌రీ సిల్వ‌ర్ ఎడిష‌న్ ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. రెండు క‌ల‌ర్ ఆప్ష‌న్లు - మిలిట‌రీ సిల్వ‌ర్ బ్లాక్‌, మిలిట‌రీ సిల్వ‌ర్ రెడ్ వేరియంట్ల ఫ్యుయ‌ల్ ట్యాంక్‌పై హ్యాండ్ పెయింటెడ్ లైన్స్ (పిన్ స్ట్రిప్స్‌) ఉంటాయి. మ‌రింత స్టైలిష్‌గా మిలిట‌రీ సిల్వ‌ర్ బ్లాక్ / రెడ్ క‌ల‌ర్ వేరియంట్ బుల్లెట్ 350 క‌నిపిస్తాయి. సేఫ్టీ కోసం మిలిట‌రీ సిల్వ‌ర్ మోడ‌ల్ బైక్స్ ఫ్రంట్‌లో 300 ఎంఎం బ్రేక్ డిస్క్‌, బ్యాక్‌లో 153 ఎంఎం డ్ర‌మ్ బ్రేక్ విత్ సింగిల్ చానెల్ ఏబీఎస్‌తో వ‌స్తుంది.

రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ 350 బుల్లెట్ ఇంజిన్ జే-సిరీస్ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న‌ది. ఈ ఇంజిన్ 349సీసీ సింగిల్ సిలిండ‌ర్, ఎయిర్ కూల్డ్‌ విత్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్‌తో వ‌స్తుంది. ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్స్‌, డ్యుయ‌ల్ రేర్ షాక్స్, రోడ్ బ‌యాస్డ్ టైర్ల‌తోపాటు ఫ్రంట్‌లో 19 అంగుళాలు, రేర్‌లో 18-అంగుళాల స్పోక్ వీల్స్ ఉంటాయి.

బేస్ మోడ‌ల్ మిలిట‌రీ రెడ్ లేదా మిలిట‌రీ బ్లాక్ వేరియంట్‌తో పోలిస్తే టాప్ ఎండ్ వేరియంట్ మోటారు సైకిల్ బ్లాక్ గోల్డ్ రాయ‌ల్ ఎన్‌ఫీల్ట్ బుల్లెట్ 350 వేరియంట్ రూ.42,239 ఎక్కువ‌. డ్యుయ‌ల్ చానెల్ ఏబీఎస్‌తోపాటు రేర్ డిస్క్ బ్రేక్‌, డార్క‌ర్ ఇంజిన్‌, ఎగ్జాస్ట్‌, 3డీ బ్యాడ్జెస్‌, హెడ్‌లైట్ విజ‌ర్ వంటి అద‌న‌పు ఫీచ‌ర్లు జ‌త చేశారు. అయిన‌ప్ప‌టికీ న్యూ మిలిట‌రీ సిల్వ‌ర్ ఎడిష‌న్ బుల్లెట్ 350 బైక్స్ మ‌రింత బ‌డ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. బీఎస్ 6.2 ప్ర‌మాణాల‌కు అనుగుణంగా రూపుదిద్దుకున్న బుల్లెట్ 350 బైక్ గ‌రిష్టంగా 6100 ఆర్పీఎం వ‌ద్ద‌ 20.2 హెచ్‌పీ విద్యుత్‌, 4000 ఆర్పీఎం వ‌ద్ద‌ 27 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది.

బుల్లెట్ మిలిట‌రీ, బుల్లెట్ మిలిట‌రీ సిల్వ‌ర్ (న్యూ), బుల్లెట్ స్టాండ‌ర్డ్‌, బుల్లెట్ బ్లాక్ గోల్డ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో బుల్లెట్ 350 వ‌స్తుంది. బేస్ బుల్లెట్ మిలిట‌రీ మిన‌హా అన్ని బుల్లెట్లు హ్యాండ్ పెయింటెడ్ పిన్ స్ట్రైప్స్‌తో వ‌స్తాయి. వీటి ధ‌ర‌లు ఇలా..

మిలిట‌రీ రెడ్ / మిలిట‌రీ బ్లాక్ : రూ.1,73,562

న్యూ మిలిట‌రీ సిల్వ‌ర్‌ రెడ్ / సిల్వ‌ర్ బ్లాక్ : రూ.1,79,000

స్టాండ‌ర్డ్ - మిలిట‌రీ రెడ్ మారూన్ / బ్లాక్‌: రూ.1,97,436

బ్లాక్ గోల్డ్: రూ. 2,15,801

Tags:    
Advertisement

Similar News