Realme C51 | రియల్‌మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్ రియల్‌మీ సీ51.. ధరెంతంటే..!
రియల్‌మీ సీ51 (Realme C51) 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.74 అంగుళాల హెచ్‌డీ (720x1600 పిక్సెల్స్) డిస్ ప్లే కలిగి ఉంటుంది.
Realme C51 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme).. భారతీయులకు మరో బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ రియల్‌మీ సీ51 (Realme C51) అందుబాటులోకి తెచ్చింది. రెండు కలర్ ఆప్షన్లు - కార్బన్ బ్లాక్, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 6.74- అంగుళాల డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వచ్చింది. 33 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ వస్తుంది. 28 నిమిషాల్లో 50 శాతం, గంటలో 100 శాతం బ్యాటరీ చార్జింగ్ అవుతుంది. బ్యాటరీ స్టేటస్‌తోపాటు డేటా యూసేజ్ తదితర వివరాలు తెలిపే మినీ క్యాప్సూల్ ఫీచర్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్ 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.8,999లకు అందుబాటులో ఉంటుంది. రియల్‌మీ డాట్ కాం, ఫ్లిప్ కార్ట్‌తోపాటు ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్లు లభిస్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు కార్డుల నుంచి కొనుగోలు చేస్తే అదనంగా రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది.
రియల్‌మీ సీ51 (Realme C51) 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.74 అంగుళాల హెచ్‌డీ (720x1600 పిక్సెల్స్) డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 560 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఒక్టాకోర్ యూనిసోక్ టీ 612 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 4జీబీ ర్యామ్ కెపాసిటీ గల ఈ ఫోన్ వర్చువల్‌గా మరో 4జీబీ ర్యామ్ పెంచుకునే టెక్నాలజీ కూడా చేర్చారు. రియల్‌మీ సీ51 ఫోన్.. ఆండ్రాయిడ్ 13 ఔటాఫ్ బాక్స్ వర్షన్ మీద పని చేస్తుంది.
డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్న రియల్‌మీ సీ51 ఫోన్.. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, అన్ స్పెసిఫైడ్ సెకండరీ సెన్సర్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్స్ కెమెరా కూడా వస్తుంది. ఇంకా 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3-కార్డ్ స్టాట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
ఇటీవలే భారత్ మార్కెట్లోకి రియల్‌మీ సీ53 ఫోన్ వచ్చింది. 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో కూడిన సెటప్ గల ఈ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.9,999 లకు లభిస్తుంది. 6జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.10,999లకు అందుబాటులో ఉంది. యూనిసోక్ టీ612 చిప్ సెట్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వచ్చిన రియల్‌మీ సీ53 ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ రియల్‌మీ యూఐటీ ఎడిషన్ వర్షన్‌పై పని చేస్తుంది.
*